Advertisement

  • పూరన్ ఆట చూస్తుంటే ఆ స్టార్ ఆటగాడు గుర్తొస్తున్నాడు ..సచిన్ టెండూల్కర్

పూరన్ ఆట చూస్తుంటే ఆ స్టార్ ఆటగాడు గుర్తొస్తున్నాడు ..సచిన్ టెండూల్కర్

By: Sankar Wed, 21 Oct 2020 5:26 PM

పూరన్ ఆట చూస్తుంటే ఆ స్టార్ ఆటగాడు గుర్తొస్తున్నాడు ..సచిన్ టెండూల్కర్


ఈ ఏడాది ఐపీయల్ అందరిని ఆశ్చర్యపరిచిన జట్టు ఏదయినా ఉందా అంటే అది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మాత్రమే ..జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నపటికీ అందరు కలిసి ఆడలేకపోవడంతో ఒక దశలో టోర్నీ నుంచి నిష్క్రమించే తొలి జట్టుగా నిలుస్తుంది అని అందరు భావించారు ..అయితే అనూహ్యంగా పుంజుకున్న రాహుల్ సేన వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది..

ఆ జట్టు విజయాలలో ఓపెనర్లు రాహుల్ , మయాంక్ ఎంత కీలకమో ఆ తర్వాత వచ్చే పూరన్ కూడా అంతే కీలకం..వార్సుపైగా మెరుపు ఇన్నింగ్సలతో పంజాబ్ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు.. ఇప్పటివరకు కింగ్స్‌ తరపున 10 మ్యాచ్‌లాడిన పూరన్‌ 183. 22 స్ట్రైక్‌ రేట్‌తో 295 రన్స్‌ చేశాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నికోలస్‌ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిసిస్తున్నారు. అందులో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఉన్నాడు..

ఢిల్లీతో మ్యాచ్‌లో నికోలస్‌ పూరన్‌ ఇన్నింగ్స్‌ అద్బుతం. అతను ఆడిన కొన్ని పవర్‌ షాట్స్‌ నాకు దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జేపీ డుమినిని గుర్తుచేశాయి. పూరన్‌ కొట్టిన ప్రతీ షాట్ క్లీన్‌గా ఉంటూనే మంచి పవర్‌ కలిగి ఉన్నాయి. అతని ఆటతీరు కొన్నిసార్లు డుమిని తలచుకునేలా చేసింది.' అని పేర్కొన్నాడు.

Tags :

Advertisement