Advertisement

  • రఫెల్ విమానాల రాకతో రక్షణ దళాల్లో నూతన నవీకరణ మొదలయింది ..సచిన్ టెండూల్కర్

రఫెల్ విమానాల రాకతో రక్షణ దళాల్లో నూతన నవీకరణ మొదలయింది ..సచిన్ టెండూల్కర్

By: Sankar Thu, 30 July 2020 9:57 PM

రఫెల్ విమానాల రాకతో రక్షణ దళాల్లో నూతన నవీకరణ మొదలయింది ..సచిన్ టెండూల్కర్



భారత అమ్ముల పొదిలో అత్యంత కీలక అస్త్రం అయినా రఫెల్ యుద్ధ విమానాలు వచ్చి చేరడంతో భారతీయులు అంత ఆనందంలో ఉన్నారు ..అయితే మరోవైపు భారత భూభాగాల మీద కన్నేసిన దాయాధి దేశాలకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా అయింది .. తాజాగా క్రికెట్ దిగ్గ‌జం, మాస్ట‌ర్ బ్లాస‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ భార‌త వైమానిక ద‌ళాన్ని(ఐఏఎఫ్‌) ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు.

ర‌ఫేల్ యుద్ద విమానాల రాక‌తో భార‌తీయ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌రింత బ‌లోపేతంగా త‌యారైంద‌ని ట్విట‌ర్ వేదిక‌గా పేర్కొన్నాడు. ఫ్రాన్స్‌లోని దసో ఏవియేషన్‌ తయారు చేసిన 36 రఫేల్‌ యుద్ధ విమానాలను రూ. 59 వేల కోట్లకు కొనుగోలు చేయడానికి 2016లో ఎన్డీయే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరిన అయిదు రఫేల్‌ యుద్ధ విమానాలు ఏడు వేల కి.మీ.లు ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి.

ఈ సంద‌ర్భంగా స‌చిన్ ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు.' అత్యాధునిక ఫైటర్ జెట్ రాఫెల్ విమానాలకు చేర్చినందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు హృదయపూర్వక అభినందనలు. ఈ యుద్ధ విమానాల చేరిక‌తో మ‌న దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌రింత బ‌లోపేతంగా త‌యారైంది. ర‌ఫేల్ విమానాల రాక‌తో ర‌క్ష‌ణ ద‌ళాల్లో నూత‌న న‌వీక‌ర‌ణ మొద‌లైంది. జైహింద్' అంటూ ట్వీట్ చేశాడు.స‌చిన్ టెండూల్క‌ర్ ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్‌గా గౌరవ పదవిలో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

Tags :
|

Advertisement