Advertisement

  • తన క్రికెట్ బ్యాట్ బాగు చేసిన వ్యక్తి కష్టాల్లో ఉన్న విషయం తెలుసుకొని ఆదుకున్న సచిన్ టెండూల్కర్

తన క్రికెట్ బ్యాట్ బాగు చేసిన వ్యక్తి కష్టాల్లో ఉన్న విషయం తెలుసుకొని ఆదుకున్న సచిన్ టెండూల్కర్

By: Sankar Wed, 26 Aug 2020 1:12 PM

తన క్రికెట్ బ్యాట్ బాగు చేసిన వ్యక్తి కష్టాల్లో ఉన్న విషయం తెలుసుకొని ఆదుకున్న సచిన్ టెండూల్కర్


భారత దిగ్గజ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఒకప్పుడు తన బ్యాట్లను బాగుచేసే అష్రఫ్ చౌదరి వ్యక్తికి కష్టకాలంలో అండగా నిలిచాడు. అష్రఫ్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం అతను డయాబెటిస్ మరియు మిడ్‌జోన్ న్యుమోనియా సంబంధిత సమస్యల కారణంగా గత 12 రోజుల నుండి భాదపడుతున్న అతను ముంబైలోని సావ్లా ఆసుపత్రిలో చేరాడు.

ఇక ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా తన వ్యాపారం కొనసాగక ఆర్ధిక ఇబ్బందులో కురుకపోయిన అతని దగ్గర చికిత్సకు కావాల్సిన డబ్బు కూడా లేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న సచిన్ ఆసుపత్రికి వెళ్లి అతడిని పరామర్శించాడు. అలాగే అతని చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం మాత్రమే కాకుండా ఆర్ధిక సహాయం కూడా చేసాడు.

అయితే సచిన్ తో పాటుగా ఐపీఎల్ సమయంలో విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌, క్రిస్‌గేల్‌, కీరన్‌ పొలార్డ్‌ వంటి ఆటగాళ్ల బ్యాట్లను కూడా అష్రఫ్ బాగుచేసేవాడు. అతనికి ఆట మరియు ఆటగాళ్ళపై ఉన్న ప్రేమతో కొన్ని సందర్భాలలో యువ ఆటగాళ్లకు ఉచితంగా బ్యాట్లను బాగుచేసి ఇచ్చాడు.అష్రఫ్‌ స్నేహితుడు ప్రశాంత్‌ జఠ్మలాని సచిన్ ఆదుకున్న విషయాన్ని తెలియజేసాడు

Tags :
|
|

Advertisement