Advertisement

  • టెస్ట్‌ క్రికెట్‌లో ఏ ఆటగాడికి సాధ్యంకాని విధంగా 15వేల పరుగులు దాటిన ఘనత సచిన్ దే

టెస్ట్‌ క్రికెట్‌లో ఏ ఆటగాడికి సాధ్యంకాని విధంగా 15వేల పరుగులు దాటిన ఘనత సచిన్ దే

By: chandrasekar Wed, 01 July 2020 10:42 AM

టెస్ట్‌ క్రికెట్‌లో ఏ ఆటగాడికి సాధ్యంకాని విధంగా 15వేల పరుగులు దాటిన ఘనత  సచిన్ దే


సచిన్‌ టెండ్కూలర్‌ అంతర్జాయతీ వన్డే క్రికెట్‌లో 15వేల పరుగులు పూర్తి చేసి నేటి సరిగ్గా 13ఏండ్లు పూర్తయ్యాయి. జూలై 29, 2007న ఆయన ఈ మైలురాయిని అధిగమించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బెల్‌ఫాస్ట్‌లో జరిగిన రెండో వన్డేలో సచిన్‌ ఈ ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 227 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించగా సచిన్‌ బ్యాట్‌తో అదరగొట్టాడు. 13ఫోర్లు, 2సిక్సర్లతో 106 బంతుల్లో 93 పరుగులు చేసి 15వేల పరుగుల మైలురాయిని దాటి 32వ ఓవర్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆఖరిలో యువరాజ్‌ సింగ్‌, దినేశ్‌కార్తిక్‌ పనిపూర్తి చేసి జట్టును విజయ తీరానికి చేర్చారు.

1989 నవంబర్‌ 15న సచిన్‌ తన తొలి టెస్టుమ్యాచ్‌ ఆడాడు. అదే ఏడాది డిసెంబర్‌ 18న తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ ఆడాడు. టెస్ట్‌ క్రికెట్‌లో ఏ ఆటగాడికి సాధ్యంకాని విధంగా 15,921 పరుగులు చేయగా ఇందులో 51 సెంచరీలున్నాయి.

వన్డేల్లోనూ అదేస్థాయిలో సచిన్‌ బ్యాటింగ్‌ విధ్వంసం కొనసాగింది. 18,426 పరుగులు చేసి ఎవ్వరికి అందని ఎత్తులో నిలిచాడు. తన సుదీర్ఘ 24ఏండ్ల కెరియర్‌లో సచిన్‌ భారత్‌ తరఫున 6ప్రపంచ కప్పులకు ప్రాతినిధ్యం వహించాడు. 2011 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులోనూ ఆయన ఆడారు.

Tags :

Advertisement