Advertisement

  • యువ ఆటగాడు పృథ్వీ షా బ్యాటింగ్ లోపాన్ని గుర్తించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్

యువ ఆటగాడు పృథ్వీ షా బ్యాటింగ్ లోపాన్ని గుర్తించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్

By: Sankar Thu, 24 Dec 2020 6:49 PM

యువ ఆటగాడు పృథ్వీ షా బ్యాటింగ్ లోపాన్ని గుర్తించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్


ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా పేలవ ప్రదర్శనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అడిలైడ్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒకే తరహా షాట్ సెలక్షన్‌తో పృథ్వీ షా వికెట్ చేజార్చుకున్నాడు..అయితే అతడి షాట్ సెలక్షన్ పై టీం ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు..

సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ పృథ్వీ షా చాలా టాలెంట్ ఉన్న బ్యాట్స్‌మెన్. కానీ.. షాట్ ఆడే సమయంలో అతని చేతులు శరీరానికి చాలా దూరంగా వెళ్లిపోతున్నాయి. దాంతో.. ఫాస్ట్ బౌలర్లు పృథ్వీ షా శరీరానికి దగ్గరగా బంతులు విసురుతూ.. అతడ్ని ఔట్ చేస్తున్నారు. పృథ్వీ షా బ్యాటింగ్ యాక్షన్ కారణంగా.. అతని బ్యాట్, ఫ్యాడ్ మధ్యలో గ్యాప్ కనిపిస్తోంది.

బంతి తన నుంచి మూవ్ అయిన తర్వాత పృథ్వీ షా బ్యాట్ ఊపుతున్నాడు. అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను ఔటైన తీరుని పరిశీలిస్తే..? బంతి వెళ్లిపోయిన తర్వాతగానీ.. పృథ్వీ షా పాదం పూర్తిగా నేలపై ఉంచలేదు. కాబట్టి.. షాట్ కోసం కాస్త వేగంగా పృథ్వీ షా ప్రిపేరైతే బెటర్’’ అని సచిన్ సూచించాడు.

Tags :
|
|

Advertisement