Advertisement

  • రహానే మనస్తత్వాన్ని చూసి బలహీనుడిగా అంచనా వేయరాదు ..సచిన్ టెండూల్కర్

రహానే మనస్తత్వాన్ని చూసి బలహీనుడిగా అంచనా వేయరాదు ..సచిన్ టెండూల్కర్

By: Sankar Fri, 25 Dec 2020 10:17 AM

రహానే మనస్తత్వాన్ని చూసి బలహీనుడిగా అంచనా వేయరాదు ..సచిన్ టెండూల్కర్


ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ లో మిగిలిన మూడు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. అయితే కెప్టెన్ కోహ్లీ పితృత్వ సెలవులపై స్వదేశానికి తిరిగి రావడంతో బాక్సింగ్ డే టెస్ట్ నుంచి రహానే భారత జట్టుకు కు నాయకత్వం వహిస్తున్నాడు..

దీనితో అందరు రహానే కెప్టెన్సీ మీద ఎంతో ఆసక్తిగా ఉన్నారు ...అసలే తొలి టెస్ట్ లో దారుణ ఓటమికి తోడు టీమిండియా స్టార్ ఆటగాడు కోహ్లీ మరియు స్టార్ బౌలర్ షమీ లేని జట్టుని రహానే ఏ విధంగా నడిపిస్తాడో చూడాలని మాజీలు భావిస్తున్నారు ..అయితే ఈ విషయం పై భారత లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... అజింక్య రహానే యొక్క ప్రశాంతత మరియు అతని ప్రవర్తన కారణంగా అతను బలహీనంగా ఉన్నాడని భావించరాదని అన్నాడు ...

అతను కూడా విరాట్ కోహ్లీ మాదిరిగా దూకుడుగా ఉంటాడని... అయితే ప్రతి వ్యక్తి వివిధ మార్గాలలో తన దూకుడు ప్రదర్శిస్తాడని... అందుకు రహానే తో పాటుగా పుజారా కూడా ఒక ఉదాహరణ అని సచిన్ చెప్పాడు. కాబట్టి, రహానే శైలి, వ్యూహాలు కోహ్లీకి కొంచెం భిన్నంగా ఉంటాయని సచిన్ పేర్కొన్నాడు. మరి రెండో టెస్ట్ లో రహానే జట్టును ఏ విధంగా ముందుకు నడిపిస్తాడు అనేది చూడాలి..

Tags :
|
|
|

Advertisement