Advertisement

  • కరోనా వలన మలింగా అలా బౌలింగ్ చేయడం కష్టమే .. సచిన్ టెండూల్కర్

కరోనా వలన మలింగా అలా బౌలింగ్ చేయడం కష్టమే .. సచిన్ టెండూల్కర్

By: Sankar Wed, 24 June 2020 9:15 PM

కరోనా వలన మలింగా అలా బౌలింగ్ చేయడం  కష్టమే  .. సచిన్ టెండూల్కర్

శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ ఫొటోను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షేర్ చేశారు. ఆ ఫొటోలో చేతిలోని బంతిని మలింగ ముద్దాడుతున్నాడు. ఇది మలింగ అలవాటు. బౌలింగ్ చేసే ప్రతిసారీ ఇలా బంతిని మలింగ ముద్దాడుతాడు. ఈ ఫొటోనే షేర్ చేసిన సచిన్.. ఇకపై మలింగ ఇలా చేయడం ఆపేయాలేమో? అంటూ ట్వీట్ చేశాడు. ‘ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి తన బౌలింగ్ రొటీన్ మార్చుకోవాల్సి వస్తోంది. ఏమంటావ్ మలి?’ అంటూ సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ నిబంధనల్లో ఐసీసీ కొన్ని మార్పులు చేసింది. వీటి ప్రకారం, ఆటగాళ్లు బంతిపై ఉమ్మి రాయకూడదు.

అయితే కరోనా కారణంగా క్రికెట్లో చాల రూల్స్ చేంజ్ అయ్యాయి ..బంతి రివర్స్ స్వింగ్ అవ్వడం కోసం బౌలర్లు ఎప్పుడు లాలాజలాన్ని ఉపయోగించి బంతిని రుద్దుతారు దీనితో బౌలర్లకు బంతి స్వింగ్ అవుతుంది ..అయితే కరోనా రావడం వలన బంతికి ఆలా ఉమ్మిని పూయడానికి నిషేధం విధించారు దాని బదులు చెమటను వాడుకొమ్మని ఐసీసీ చెప్పింది ..అయితే దీనిపైనా ,మిశ్రమఅభిప్రాయాలూ వచ్చాయి సచిన్ వంటి వారు దీనిని వ్యతికరేకించారు ..ఈ రూల్ పెట్టడం వలన బాట్స్మన్ కు ఇంకా అనుకూలం అవుతుంది అని వాదిస్తున్నారు

Tags :
|
|
|

Advertisement