Advertisement

  • హెల్మెట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి .. సచిన్ టెండూల్కర్

హెల్మెట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి .. సచిన్ టెండూల్కర్

By: Sankar Tue, 03 Nov 2020 5:41 PM

హెల్మెట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి .. సచిన్ టెండూల్కర్


క్రికెట్ లో గాయాలు అత్యంత సహజమే అయిన, 2014 నవంబర్‌లో ఆసీస్‌ క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూస్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బౌలర్‌ విసిరిన బంతి హెల్మెట్‌ ‍ కింది మెడ భాగంలో బలంగా తగిలింది. దీంతో క్రీజులోనే కుప్పకూలిన హ్యూస్‌ రెండు రోజుల తర్వాత మరణించడం క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ విషాదవార్త అ‍ప్పటి క్రికెట్‌లో ఒక చెడు జ్ఞాపకంగా నిలిచిపోయింది.

ఇక తాజాగా ఐపీయల్ లో హైదరాబాద్ ఆటగాడు విజయ్‌ శంకర్‌ పరుగు తీసే క్రమంలో కింగ్స్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌‌ విసిరిన త్రో అతని మెడకు బలంగా తగిలింది. దీంతో విజయ్‌ శంకర్‌ తీవ్రమైన గాయంతో విలవిలలాడడం కనిపించింది. వెంటనే ఫిజియోథెరపీ వచ్చి చికిత్స అందించాడు. కానీ అదృష్టవశాత్తు ఆ సమయంలో అతను హెల్మెట్‌ ధరించడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. దీనిపై సచిన్‌ టెండూల్కర్ ట్విటర్‌ వేదికగా‌ స్పందించాడు.

సాధారణంగా క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటింగ్‌ చేస్తున్న ఆటగాళ్లు హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి. ఒక ఫాస్ట్‌ బౌలర్‌ బౌలింగ్‌కు వస్తే బ్యాటింగ్‌ ఆటగాడు హెల్మెట్‌ ధరించడం.. ఒక స్పిన్నర్‌ బౌలింగ్‌కు వస్తే హెల్మెట్‌ను తీసేయడం చేస్తున్నారు.కానీ ఈ పద్దతిని మార్చాలని.. బౌలర్‌ స్పిన్నరైనా.. ఫాస్ట్‌ బౌలరైనా బ్యాట్స్‌మన్‌ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించే నిబంధనను తీసుకురావాలి. హెల్మెట్‌ అనేది ఆటగాళ్లకు రక్షణగా నిలుస్తుందని.. ఈ నిబంధనను తప్పనిసరి చేయకపోతే ఆటగాళ్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకే ఇకపై స్పిన్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌ ఏదైనా సరే హెల్మెట్‌ తప్పనిసరి ధరించాలనే నిబంధనను తీసుకురావాలని ఐపీసీని విజ్ఞప్తి చేస్తున్నా 'అంటూ ట్విటర్‌లో తెలిపాడు.

Tags :
|
|
|
|

Advertisement