Advertisement

  • కెప్టెన్సీ అదనపు ఒత్తిడిలాగా భావించాడు ..సచిన్ కెప్టెన్సీ పై చందు బోర్డే వ్యాఖ్యలు

కెప్టెన్సీ అదనపు ఒత్తిడిలాగా భావించాడు ..సచిన్ కెప్టెన్సీ పై చందు బోర్డే వ్యాఖ్యలు

By: Sankar Mon, 22 June 2020 11:18 AM

కెప్టెన్సీ అదనపు ఒత్తిడిలాగా భావించాడు ..సచిన్ కెప్టెన్సీ పై చందు బోర్డే వ్యాఖ్యలు



సచిన్ టెండూల్కర్ ఒక బాట్స్మన్ గా అతడు సాధించిన రికార్డులు గురించి చెప్పాలంటే మాటలు చాలవు ..తన అనితర సాధ్యమైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్లో బ్యాటింగ్లో ఉన్న అనేక రికార్డులను తన కాతాలో వేసుకున్నాడు..అత్యధిక సెంచరీలు , అత్యధిక పరుగులు, అత్యధిక మాన్ అఫ్ ది మ్యాచ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ చాలా పెద్దది ..మరి బ్యాటింగ్లో ఇన్ని ఘనతలను సాధించిన సచిన్ కెప్టెన్గా మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శనను చేయలేకపోయాడు ..

సచిన్ కెప్టెన్సీలో టీమిండియా సరైన విజయాలను సాదించలేకపోయింది .సచిన్ రాణించినప్పటికి సహచరుల నుంచి సహకారం లేకపోవడంతో టీమిండియా విజయాలను సాధించలేదు ..అతని కెప్టెన్సీలో భారత్ జట్టు 25 టెస్టులాడి నాలుగు మ్యాచ్‌ల్లో, 73 వన్డేల్లో 23 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. ముఖ్యంగా.. 1999 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత సచిన్ కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు చందు వెల్లడించాడు.

ఆస్ట్రేలియా పర్యటనకి సచిన్‌ కెప్టెన్సీలో జట్టుని అప్పట్లో ఎంపిక చేసి పంపించాం. కానీ.. ఆ టూర్‌ ముగిసి స్వదేశానికి రాగానే సచిన్.. ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకున్నట్లు నాతో చెప్పాడు. బ్యాటింగ్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు సచిన్ వివరించాడు. కానీ.. నేను అతడ్ని ఒప్పించే ప్రయత్నం చేశాను. సుదీర్ఘకాలం నువ్వు కెప్టెన్‌గా కొనసాగగలవని నచ్చచెప్పాను. కానీ.. సచిన్ మాత్రం వినలేదు. సచిన్‌ని నేను బలవంతం చేయడంతో అప్పట్లో నా సహచరులు కూడా నన్ను వారించారు. దాంతో గంగూలీ చేతికి టీమ్ పగ్గాలిచ్చాం’’ అని చందు బోర్డే వెల్లడించాడు.సచిన్ కు కెప్టెన్సీ అదనపు ఒత్తిడిలాగా అనిపించింది ..బ్యాటింగ్ మీద ద్రుష్టి పెట్టడం కోసం కెప్టెన్సీని త్యాగం చేసాడు అని బోర్డే అన్నాడు..



Tags :
|
|

Advertisement