Advertisement

  • రోహిత్ ఉంటే జట్టులో సమతూకం ఉంటుంది ..మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్

రోహిత్ ఉంటే జట్టులో సమతూకం ఉంటుంది ..మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్

By: Sankar Thu, 10 Dec 2020 10:51 AM

రోహిత్ ఉంటే జట్టులో సమతూకం ఉంటుంది ..మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్


ఫిట్నెస్ సమస్యల కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ మీద మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు ...రోహిత్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే మాత్రం ఆస్ట్రేలియాకు పంపాలని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సూచించాడు తనకైతే రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ గురించి తెలియదని, వంద శాతం ఫిట్‌నెస్‌తో ఉంటే మాత్రం ఆస్ట్రేలియా పర్యటనకు పంపడం ఉత్తమం అన్ని పేర్కొన్నాడు.

రోహిత్‌ శర్మ నాణ్యమైన ఓపెనర్‌ అని, అతను ఉంటే జట్టు సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ‘ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టులో రోహిత్‌ శర్మ ఉంటే బాగుంటుంది. రోహిత్‌ ఫిట్‌నెస్‌ పరంగా నిరూపించుకుంటే మాత్రం మరో ఆలోచన లేకండా ఆస్ట్రేలియాకు పంపండి. రోహిత్‌ ఫిట్‌నెస్‌ స్టాటస్‌ అయితే నాకు తెలీదు. అది నా వ్యవహారం కూడా కాదు. ఆ విషయం బీసీసీఐ-రోహిత్‌లకు మాత్రమే తెలుస్తుంది. వారివురూ టచ్‌లో ఉన్నారు కాబట్టి ఫిట్‌నెస్‌ ఏమిటనేది వారికే తెలుస్తుంది.

ఇక ఫిజియో-టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎప్పటికప్పుడు రోహిత్‌ ఫిట్‌నెస్‌ను పర్యవేక్షిస్తోంది. దీనికి వారే సమాధానం చెప్పాలి. నేను చెప్పేది మీకు తెలియజేసేది ఒక్కటే..రోహిత్‌ 100 శాతం ఫిట్‌నెస్‌ను సాధిస్తే మాత్రం ఆస్ట్రేలియా పర్యటనకు పంపడం చాలా మంచిది. అతని సత్తా ఏమిటో మనకు తెలుసు. నాలుగు టెస్టుల సిరీస్‌కు రోహిత్‌ ఉంటే జట్టు సమతూకంగా ఉంటుంది’ అని సచిన్‌ తెలిపాడు

Tags :
|

Advertisement