Advertisement

  • ప్లాస్మా డోనేట్ చేయాలంటూ దాతాలకు సచిన్ విజ్ఞప్తి

ప్లాస్మా డోనేట్ చేయాలంటూ దాతాలకు సచిన్ విజ్ఞప్తి

By: chandrasekar Fri, 10 July 2020 6:03 PM

ప్లాస్మా డోనేట్ చేయాలంటూ దాతాలకు సచిన్ విజ్ఞప్తి


సచిన్ తెందూల్కర్ కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాపాయ స్ధితిలో ఉన్నవారి ప్రాణాలు కాపాడడానికి ప్లాస్మా డోనేట్ చేయాలంటూ దాతాలకు విజ్ఞప్తి చేశారు. ముంబయి కార్పోషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్మా థెరపీ కేంద్రాన్ని అంథేరిలోని సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో ప్రారంభించారు సచిన్.

కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ "కరోనా వల్ల దేశం విపత్కర పరిస్థితులపు ఎదుర్కొంటోంది. వైద్య సిబ్బంది,పోలీసులు ,మున్సిపల్ వర్కర్స్ చేస్తున్న సేవలు మరవలేనివి. మహామ్మారి వ్యాప్తి చెందకుండా వారి నిరంతరాయంగా పనిచేస్తున్నారు. వైరస్‌ సోకిన వారిని వైద్యాధికారుల సేవలు వెలకట్టలేనివి. కరోనాపై పోరాడే మందును కనుక్కోడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

ప్లాస్మా థెరపీ చికిత్స ద్వారా విషమ పరిస్థితుల్లో ఉన్న వారిని కాపాడుకోవచ్చు . ఇలాంటి సేవలను ప్రారంభించిన మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు. దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాలని" కోరారు.

కరోనా వ్యాధిని ఎదుర్కొవడానికి ప్లాస్మా థెరఫీ విధానాన్ని ఉపయోగిస్తున్న సంగతి తేలిసిందే. వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో వ్యాధిని ఎదుర్కొనే యాంటీబాడీలు తయారవుతాయి. కావున వ్యాధి సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడానికి అలాంటి వారి రక్తంలోని ప్లాస్మాను సేకరించి ఎక్కించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వారు తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

Tags :
|
|
|

Advertisement