Advertisement

  • కేరళకు చెందిన సబిత... బ్రైడల్‌ గౌన్‌ను కానుకగా అందిస్తూ .

కేరళకు చెందిన సబిత... బ్రైడల్‌ గౌన్‌ను కానుకగా అందిస్తూ .

By: chandrasekar Fri, 02 Oct 2020 3:57 PM

కేరళకు చెందిన సబిత... బ్రైడల్‌ గౌన్‌ను కానుకగా అందిస్తూ .


పెండ్లి వేడుకలో ధరించడానికి సరైన దుస్తులు లేని పేదింటి ఆడపడుచుల కల్యాణాన్ని కమనీయ కావ్యంగా మారుస్తున్నది కేరళలోని కన్నూరు నివాసి సబిత. వాళ్లాయన ఏడాదిలో సగం రోజులు సౌదీలో సగం రోజులు కన్నూరులో ఉంటాడు. ఓ రకంగా సంపన్న కుటుంబమే! ఏ సమస్యలూ లేవు. ‘రెయిన్‌బో విమెన్‌ అవుట్‌ఫిట్‌' సంస్థ ద్వారా సబిత నలుగురికీ సాయం చేస్తూ ఉంటుంది. నలుగురితో సాయం చేయిస్తూ కూడా ఉంటుంది. క్యాన్సర్‌ పేషెంట్లకు ఆర్థిక సాయం అందిస్తుంది, అనాథలకు దుస్తులు పంచుతూ ఉంటుంది. భర్త కూడా ప్రోత్సహించేవాడు.

ఇటీవల సబితకు ఎందుకో నిరుపేద పెండ్లి కూతుళ్ల కష్టాలు గుర్తుకొచ్చాయి. వాళ్ల వైపు నుంచి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆరా తీస్తే వారిలో చాలామందికి సంప్రదాయమైన బ్రైడల్‌ గౌన్‌ కూడా కొనలేని పరిస్థితి. జీవితంలో మధురమైన అధ్యాయంగా నిలిచిపోవాల్సిన పెండ్లి వేడుక పేదరికం కారణంగా చేదు జ్ఞాపకంగా మిగిలిపోకూడదని అనుకున్నది సబిత. అదే సమయంలో మొదలైన లాక్‌డౌన్‌ పేద కుటుంబాలను మరింత సమస్యల్లోకి నెట్టింది. రంగంలోకి దిగిన సబిత నిరుపేద వధువులకు పెండ్లి గౌన్‌ కానుకగా అందించమని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభ్యర్థించింది.

ఎవరైనా తమకు గౌన్‌ పంపిస్తే అవసరమైనవారికి చేరవేస్తామని ప్రకటించింది. ‘ధరించడానికి వీలుగా, చిరుగులు లేకుండా ఉండాలి, డ్రైక్లీన్‌ చేయించాలి. అలాంటి వాటినే తీసుకుంటాం’ అని స్పష్టంగా వివరిందింది. కొద్ది రోజుల్లోనే 300 గౌన్లు సబిత ఇంటికి చేరాయి. ఈ ప్రయత్నంలో 22 మంది మహిళలు తోడుగా నిలిచారు. వీరంతా గృహిణులే. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నవాళ్లే. అయితేనేం వాళ్ల మనసు చాలా గొప్పది. అందరూ సబితకు వెంట నిలిచారు. గౌన్ల సేకరణ, వాటిలో చిన్నాచితకా లోటుపాట్లుంటే సరిచేయడం చేసేవారు. వీరు అందిస్తున్న తోడ్పాటు గురించి తెలిసి ఎందరో నిరుపేదలు సబితను సాయం కోరుతున్నారు. అడిగిందే తడవుగా పెండ్లికానుకను పంపుతున్నది సబిత బృందం. ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన గౌన్లు కూడా సబిత దగ్గరికి వస్తున్నాయి. కలలో కూడా ఊహించని ఖరీదైన గౌనుతో పేదింటి పెండ్లి కూతుళ్లకు కొత్త కళ యిస్తున్నది సబిత.

Tags :
|
|
|

Advertisement