Advertisement

అయ్యప్ప గుడిలో భక్తులకు అనుమతి

By: Sankar Sun, 18 Oct 2020 3:06 PM

అయ్యప్ప గుడిలో భక్తులకు అనుమతి


దాదాపు ఏడు నెలల తర్వాత కేరళలోని శబరిమల ఆలయంలోకి భక్తులను అనుమతించారు. నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా అయిదు రోజుల పూజ కోసం భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు.

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశంలోని అన్ని ఆలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఆన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కటి మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆగష్టులోనే పూజల నిమిత్తం శబరిమల తెరుచుకున్నప్పటికీ భక్తులకు దర్శనాలకు అనుమతించలేదు. తాజాగా శనివారం నుంచి ఆగస్టు 21 న నెలవారీ పూజ కార్యక్రమాలు సాయంత్రం పూర్తయ్యే వరకు భక్తులను అనుమతించనున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ఆలయాన్ని దర్శించుకునే వారికి కేరళ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఇందులో భాగంగా ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమలలో దర్శనానికి అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా ఏటా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తున్న నేపథ్యంలో వీటి గురించి భక్తులకు తెలియజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి కేరళ ప్రభుత్వం లేఖ రాసింది.దీంతో మార్గదర్శకాలపై విస్తృత ప్రచారం చేసేందుకు దేవదాయ శాఖ నడుం బిగించింది. అలాగే కేరళలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నందున అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు

Tags :
|

Advertisement