Advertisement

  • రష్యా ప్రతిపక్ష నేత, వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవల్నీ పై విష ప్రయోగం

రష్యా ప్రతిపక్ష నేత, వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవల్నీ పై విష ప్రయోగం

By: chandrasekar Thu, 20 Aug 2020 5:38 PM

రష్యా ప్రతిపక్ష నేత, వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవల్నీ పై విష ప్రయోగం


రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీపై విష ప్రయోగం జరిగిందని ఆయన ప్రెస్ సెక్రటరీ తెలిపారు. రష్యా ప్రతిపక్ష నేత, వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవల్నీ హాస్పిటల్ పాలయ్యారు. సైబీరియాలోని తోమస్క్ నగరం నుంచి మాస్కో వెళ్తుండగా విమానంలోనే అలెక్సీ అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేసి ఆయన్ను సైబీరియాలోని హాస్పిటల‌్‌కు తరలించారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు ఇచ్చిన టీలో విషం లాంటిది ఏదో కలిపారని ప్రెస్ సెక్రటరీ కిరా యర్మిష్ తెలిపారు. ఉదయం అలెక్సీ టీ మాత్రమే తాగారని ఆమె తెలిపారు.

44 ఏళ్ల అలెక్సీ ప్రస్తుతం కోమాలో ఉండగా ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. గత ఏడాది కూడా ఆయనకు తీవ్రమైన అలర్జీ వచ్చిందని కిరా తెలిపారు. గుర్తు తెలియని రసాయనంతో ఆయనపై విష ప్రయోగం జరిగిందని డాక్టర్ చెప్పారన్నారు. తొమస్క్ ఎయిర్‌పోర్టులో అలెక్సీకి టీ ఇచ్చిన తమ సిబ్బంది ఇప్పుడు కనిపించడం లేదని వియన్నా కేఫే మేనేజర్ తెలిపారు. ప్రస్తుతం ఆ కేఫేను మూసివేసి విచారణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. లాయర్ అయిన అలెక్సీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొనడంతో ఇటీవలి కాలంలో అనేక పర్యాయాలు జైలుకు వెళ్లొచ్చారు.

Tags :
|

Advertisement