Advertisement

  • కరోనా కారణంగా తిరుపతిలోనే చిక్కుకున్న రష్యాకు చెందిన మహిళలు

కరోనా కారణంగా తిరుపతిలోనే చిక్కుకున్న రష్యాకు చెందిన మహిళలు

By: chandrasekar Fri, 31 July 2020 09:37 AM

కరోనా కారణంగా తిరుపతిలోనే చిక్కుకున్న రష్యాకు చెందిన మహిళలు


రష్యాకు చెందిన ఓ విదేశీ మహిళ ఆధ్యాత్మిక యాత్ర కోసం ఇండియాకు తన తల్లితో కలిసి వచ్చింది. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో తిరుపతిలో ఇరుక్కుపోయింది. దీంతో స్థానికంగా ఆ మహిళతో పాటు తన తల్లిని ఓ న్యాయవాది కుటుంబం ఆదరించింది. వారింట్లోనే బస, భోజన వసతి కల్పించారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో పలువురు స్పందించారు.

ఈ క్రమంలోనే ఎట్టకేలకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే రష్యాకు చెందిన తల్లీకూతుళ్లు ఒలివియా(55), ఎస్తర్(32)లు ఆధ్యాత్మిక యాత్ర కోసం భారత్‌కు వచ్చారు. పలు ఆలయాలను దర్శించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతికి చేరుకున్నారు. కానీ ఆ సమయంలోనే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ఇక్కడే ఇరుక్కుపోయారు.

దీంతో స్థానికంగా ఉండే ఓ న్యాయవాది కుటుంబం ఆదరించి ఎస్తర్‌కు వారింట్లోనే బస, భోజన వసతి కల్పించింది. ఈ విషయం ఇటీవల పలు పత్రికల్లో వచ్చింది. దీనికి స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తన ప్రతినిధులను ఎస్తర్ వద్దకు పంపించారు. వారికి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించడంతో ఎస్తర్‌తో పాటు తన తల్లి ఒలివియా శ్రీవారిని దర్శించుకున్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూతురు స్వర్ణభారతి ట్రస్టు చైర్మన్ దీపా వెంకట్ అండగా నిలిచారు. తల్లీకూతుళ్లతో స్వయంగా ఆమె మాట్లాడారు. రష్యన్- తెలుగు, రష్యన్- హిందీ మాట్లాడే దుబాసీలను తల్లీకూతుళ్ల వద్దకు పంపుతున్నారు. బృందావనంలో చిక్కుకున్న వారిని తిరుపతికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేశారు. ఈ విషయంపై సోనూసూద్ స్పందిస్తూ తన వంతుగా ఏలాంటి సాయమైనా చేస్తానంటూ వారికి హామీనిచ్చారు.

Tags :
|

Advertisement