Advertisement

  • రష్యన్ స్టర్జన్, అమెరికన్ పాడిల్ ఫిష్ యొక్క హైబ్రిడ్ 'స్టర్డిల్‌ ఫిష్'

రష్యన్ స్టర్జన్, అమెరికన్ పాడిల్ ఫిష్ యొక్క హైబ్రిడ్ 'స్టర్డిల్‌ ఫిష్'

By: chandrasekar Thu, 23 July 2020 11:21 AM

రష్యన్ స్టర్జన్, అమెరికన్ పాడిల్ ఫిష్ యొక్క హైబ్రిడ్ 'స్టర్డిల్‌ ఫిష్'


హంగేరి శాస్త్రవేత్తలకు ఏదో చేయాలని ప్రయత్నిస్తే మరోదే తయారైందంట. రెండు వేర్వేరు జాతుల చేపలను ఎలా పెంచుకోవచ్చో అని పరిశోధన చేస్తుండగా అనుకోకుండా కొత్త రకం చేప పుట్టుకొచ్చిందంట. ఈ విషయాన్ని హంగేరిలోని నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ పరిశోధకులు వెల్లడించారు.

రష్యన్ స్టర్జన్, అమెరికన్ పాడిల్ ఫిష్ యొక్క హైబ్రిడ్ అయిన ఈ కొత్త చేపకు 'స్టర్డిల్‌ ఫిష్' అని పేరుపెట్టారు. నిజానికి కొత్త చేపను సృష్టించాలని తాము ప్రయత్నించలేదని, అప్రయత్నంగానే కొత్త జాతి చేప పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ రెండు చేప జాతులు జీవన శిలాజాలు కావడం విశేషం. ఈ చేప జాతులు 184 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ధృడమైన చేపలు వంధ్యత్వానికి గురవుతాయని, అయినప్పటికీ 100 ఏండ్లకు పైగా జీవించగలవని శాస్త్రవేత్తలు తెలిపారు. అసిపెన్సెరిడే, పాలియోడొంటిడే కుటుంబ జాతుల మధ్య ఇది ​​మొదటి విజయవంతమైన హైబ్రిడైజేషన్ అని శాస్త్రవేత్తలు జర్నల్ జీన్స్ లో ప్రచురించిన కొత్త పరిశోధన వ్యాసంలో తెలిపారు.

Tags :

Advertisement