Advertisement

  • మరో వ్యాక్సిన్‌ను అక్టోబర్‌ 15 లోగా రిజిస్టర్ చేయనున్న రష్యా

మరో వ్యాక్సిన్‌ను అక్టోబర్‌ 15 లోగా రిజిస్టర్ చేయనున్న రష్యా

By: chandrasekar Thu, 01 Oct 2020 4:51 PM

మరో వ్యాక్సిన్‌ను అక్టోబర్‌ 15 లోగా రిజిస్టర్ చేయనున్న రష్యా


ప్రపంచంలోనే మొదటి కరోనా‌ టీకాను రిజిస్టర్‌ చేసిన రష్యా రెండో టీకాను కూడా నమోదు చేసేందుకు రెడీ అవుతున్నది. సైబీరియాకు చెందిన వెక్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేసిన రెండో కరోనా‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఇటీవల పూర్తిచేశారు.

ఈ విషయాన్ని ఆర్‌ఐఏ వార్తా సంస్థ బుధవారం ప్రకటించింది. వెక్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫేస్‌ 2 క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలిపింది.

ఎపివాక్ కరోనాగా పిలుస్తున్న వెక్టర్ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన మరో వ్యాక్సిన్‌ను అక్టోబర్‌ 15 లోగా రిజిస్టర్‌ చేస్తామని నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌ వాచ్‌డాగ్ ఇటీవల ప్రకటించింది. కాగా, రష్యా మొదట రిజిస్టర్‌ చేసిన వ్యాక్సిన్‌ పేరు స్పుత్నిక్‌ వీ. దీన్ని ఆగస్టు 11న నమోదు చేసింది.

Tags :
|

Advertisement