Advertisement

  • క‌రోనా వైర‌స్‌తో సైడ్ఎఫ్టెక్స్‌పై ర‌ష్యా హెచ్చరిక

క‌రోనా వైర‌స్‌తో సైడ్ఎఫ్టెక్స్‌పై ర‌ష్యా హెచ్చరిక

By: chandrasekar Fri, 03 July 2020 11:05 AM

క‌రోనా వైర‌స్‌తో సైడ్ఎఫ్టెక్స్‌పై ర‌ష్యా హెచ్చరిక


క‌రోనా వైర‌స్‌తో బాధ‌ప‌డిన వారిలో వీర్య‌క‌ణాల సంఖ్య త‌గ్గుతున్న‌ద‌ట‌. అంతేకాదు, అది వంధ్య‌త్వానికి కూడా దారితీసే ప్ర‌మాదం ఉంద‌ని ర‌ష్యా ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ హెచ్చరించింది.

త‌మ మెడిక‌ల్ వ‌ర్క‌ర్స్ పొందుప‌రిచిన డేటా ఈ విష‌యాల‌ను వెల్ల‌డిస్తున్న‌ట్లు మాస్కోకు చెందిన చీఫ్ గైన‌కాల‌జిస్ట్ ఎలినా ఉవ‌రోవా తెలిపారు. వంధ్య‌త్వ(ఇన్‌ఫెర్టిలిటీ) స‌మ‌స్య ముఖ్యంగా పురుషుల్లో అధికంగా ఉంద‌ని, క‌రోనాతో బాధ‌ప‌డిన వారిలో ఇది మ‌రింత తీవ్ర స్థాయిలో ఉన్న‌ట్లు ఆ డాక్ట‌ర్ తెలిపారు.

కరోనా వైర‌స్ నుంచి కోలుకున్న మ‌గ‌వారిలో 38 శాతం వీర్య క‌ణాలు త‌గ్గిన‌ట్లు ర‌ష్యా మెడిక్స్ గుర్తించారు. ఇది ఆందోళ‌న క‌లిగిస్తున్న అంశ‌మ‌ని, ఓవ‌రాల్‌గా ర‌ష్యా పురుషుల్లో వీర్య‌క‌ణాల నాణ్య‌త త‌క్కువే అని, ఇప్పుడు క‌రోనాతో ప‌రిస్థితి మ‌రింత దారుణ‌మైంద‌ని ఆ డాక్ట‌ర్ తెలిపారు.

వీర్య‌క‌ణాల్లో కూడా వైర‌స్ చొచ్చుకుపోతున్న‌ట్లు ఇప్ప‌టికే కొన్ని అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయి. క‌రోనా వైర‌స్ వృష‌ణాల‌ను డ్యామేజ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు చైనా-అమెరికా నిర్వ‌హించిన ఓ సెర్వేలో తేలింది.

Tags :
|
|

Advertisement