Advertisement

ఏటీపీ ఫైనల్స్ విజేతగా నిలిచిన మెద్వెదెవ్‌

By: Sankar Tue, 24 Nov 2020 06:36 AM

ఏటీపీ ఫైనల్స్ విజేతగా నిలిచిన మెద్వెదెవ్‌


రష్యా స్టార్‌ ప్లేయర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ ఏటీపీ ఫైనల్స్‌ విజేతగా నిలిచి.. తన కెరీర్‌లోనే అత్యున్నతమైన టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్లో డానిల్‌ 4-6, 7-6(7/2), 6-4 తేడాతో మూడో ర్యాంకర్‌ డొమినిక్‌ థీమ్‌(ఆస్ట్రియా)పై విజయం సాధించాడు.

తొలి సెట్‌ కోల్పోయి.. రెండో సెట్‌ టై బ్రేకర్‌కు వెళ్లగా.. 0-2తో వెనుకబడిన సమయంలో మెద్వెదెవ్‌ వరుసగా ఏడు పాయింట్లు సాధించి సత్తాచాటాడు. మూడో సెట్‌ను సునాయాసంగా గెలిచాడు. అలాగే ఈ టోర్నీలో జొకోవిచ్‌, నాదల్‌, థీమ్‌ను ఓడించిన మెద్వెదెవ్‌.. ఏటీపీ ఫైనల్స్‌లో టాప్‌-3 ర్యాంకర్లను మట్టికరిపించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

ఈ ఏడాది చెరో గ్రాండ్‌స్లామ్‌ విజేతలుగా నిలిచిన ఆ ముగ్గురిని ఓడించి సంవత్సరాంతపు టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. కెరీర్‌లోనే అత్యుత్తమ టైటిల్‌ సాధించినా మెద్వెదెవ్‌ సంబురాలు చేసుకోలేదు. ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లో(కరోనా వైరస్‌ కారణంగా) ఉన్నంత కాలం తాను విజయాలు సాధించినా వేడుక చేసుకోదల్చుకోవడం లేదని అతడు చెప్పాడు.

Tags :
|
|

Advertisement