Advertisement

  • రష్యాలో తగ్గుముఖం పడుతున్న కరోనా ..నెల రోజుల తర్వాత ఆరువేల కంటే తక్కువ కేసులు నమోదు

రష్యాలో తగ్గుముఖం పడుతున్న కరోనా ..నెల రోజుల తర్వాత ఆరువేల కంటే తక్కువ కేసులు నమోదు

By: Sankar Wed, 22 July 2020 1:37 PM

రష్యాలో తగ్గుముఖం పడుతున్న కరోనా ..నెల రోజుల తర్వాత ఆరువేల కంటే తక్కువ కేసులు నమోదు



కరోనా పుట్టింది చైనా లో అయినా దాని దాటికి బలి అయింది మాత్రం వేరే దేశాలు..కరోనా విజృంబిస్తున్న తొలినాళ్లలో యూరోప్ మీద విరుచుకుపడింది ..ఇటలీ , స్పెయిన్ వంటి దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి ..అయితే ఆ తర్వాత అమెరికా , బ్రెజిల్ , ఇండియా , రష్యా వంటి దేశాల మీద తీవ్ర ప్రతాపం చూయించింది..అయితే రష్యాలో ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తుంది ..

గడచిన 24 గంటల్లో రష్యాలో 5,842 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కరోనా రెస్పాన్స్‌ సెంటర్‌ తెలిపింది.. దాదాపు నెలరోజుల తర్వాత ఒకేరోజు తొలిసారి 6వేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7,83,328కు పెరిగింది. 24 గంటల్లో మరో 153 మంది ప్రాణాలు కోల్పోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 12,580కు పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యలో రష్యా నాలుగో స్థానంలో ఉన్నది. వరుసగా ఏడో రోజూ అమెరికాలో 60వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి..ఆ తర్వాత ఇండియా , బ్రెజిల్ లలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి ..అయితే వాక్సిన్ ప్రయోగాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి ..

Tags :
|
|
|
|

Advertisement