Advertisement

  • వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం రష్యా చేసిన ప్రతిపాదన వివాదాస్పద౦...

వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం రష్యా చేసిన ప్రతిపాదన వివాదాస్పద౦...

By: chandrasekar Sat, 28 Nov 2020 7:45 PM

వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం రష్యా చేసిన ప్రతిపాదన వివాదాస్పద౦...


కరోనా వైరస్‌కు అత్యంత సమర్ధవంతమైన వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం రష్యా చేసిన ప్రతిపాదన వివాదాస్పదమవుతోంది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెన్‌కా టీకా తాము తయారుచేసిన స్పుత్నిక్‌-వికి జోడిస్తే ఎదురుండదని ప్రతిపాదించింది. రష్యన్ ఆర్డీఐఎఫ్ వర్గాలు ట్వీట్‌ చేయడం సంచలనం సృష్టించింది. రెండు వ్యాక్సిన్ల ఫార్ములాలతో ఏర్పడే కొత్త వ్యాక్సిన్‌ను రీవ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కీలక అస్త్రంగా వాడొచ్చని సూచించారు. ‘ మీరు (ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ) పరీక్షించిన రెండు పూర్తిస్థాయి డోస్‌ల టీకా ప్రభావశీలత 62 శాతంగా ఉంది. దీని ప్రభావశీలతను పెంచేందుకు మరోసారి ఇదే డోసేజీతో ప్రయోగ పరీక్ష చేపట్టాలని భావిస్తే స్పుత్నిక్‌-వీని మీ(ఆక్స్‌ఫర్డ్‌) వ్యాక్సిన్‌తో కలిపి పరీక్షించి చూడండి’ అని తెలిపారు.

ఈ రెండు టీకాలను‘అడినో వైరల్‌ వెక్టర్‌’లతో అభివృద్ధి చేశారు. అయితే స్పుత్నిక్‌-వీ తయారీలో మానవుల్లో జలుబుకు కారణమయ్యే అడినో వైర్‌సను, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ కోసం చింపాజీల్లో జలుబుకు కారణమయ్యే అడినో వైరస్‌ను వాడారు. కాగా, తాము ఉత్పత్తి చేసిన టీకా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు స్పుత్నిక్-వీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఒక్క డోస్ తీసుకున్న వ్యక్తుల్లో 90 శాతం, రెండు డోస్‌లు తీసుకున్నవారిలో 62 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్టు క్లినికల్ ట్రయల్స్ డేటాలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా తెలిపింది. దీనిపై నిపుణుల నుంచి విమర్శలు రావడంతో తయారీలో లోపం జరిగినట్టు ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరోసారి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు ఆస్ట్రాజెన్‌కా సీఈఓ పాస్కల్ సోరియట్ ప్రకటించారు. వ్యాక్సిన్ పనితీరును మరింత లోతుగా పరిశీలించేందుకు ప్రపంచవ్యాప్తంగా మరోమారు ట్రయల్స్ నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

Tags :
|

Advertisement