Advertisement

  • కరోనా వ్యాక్సిన్ తీసుకోబోతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

కరోనా వ్యాక్సిన్ తీసుకోబోతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

By: Sankar Sun, 27 Dec 2020 9:28 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకోబోతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్


ప్రపంచ వ్యాప్తంగా ఒకవైపు కొత్త కరోనా వైరస్ విజృంభిస్తుంటే , మరొక వైపు గత ఏడాదిగా అన్ని దేశాలను ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా వైరస్ కు వాక్సిన్ పంపిణి జరుగుతుంది ...అందులో భాగంగా ఇప్పటికే రష్యా లో 3 లక్షల మందికి వ్యాక్సిన్ ను అందించారు.

గతంలో 18 నుంచి 60 సంవత్సరాల వయసు లోపున్న వ్యక్తులకు మాత్రమే వ్యాక్సిన్ ను అందించారు. 60 సంవత్సరాలు దాటిన వారికీ కూడా వ్యాక్సిన్ అందించేందుకు రష్యా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు సోమవారం నుంచి వ్యాక్సిన్ అందించబోతున్నారు.

ఇందులో భాగంగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వ్యాక్సిన్ తీసుకోబోతున్నారు. సోమవారం రోజున అధ్యక్షుడు పుతిన్ వ్యాక్సిన్ తీసుకోబోతున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు కూడా టీకా తీసుకోబోతుండటంతో టీకాపై మరింత నమ్మకం పెరిగింది..కాగా రష్యా కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ని తయారు చేసిన విషయం తెలిసిందే..

Tags :
|
|
|

Advertisement