Advertisement

  • కరోనా వాక్సిన్ విషయంలో శుభవార్త చెప్పిన రష్యా

కరోనా వాక్సిన్ విషయంలో శుభవార్త చెప్పిన రష్యా

By: Sankar Thu, 30 July 2020 6:21 PM

కరోనా వాక్సిన్ విషయంలో శుభవార్త చెప్పిన రష్యా



ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న తరుణంలో వ్యాక్సిన్‌ తయారీకి శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తామే ముందుగా వ్యాక్సిన్‌ను కనిపెట్టి, మార్కెట్‌లోకి విడుదల చేయాలని అమెరికా, చైనా, భారత్‌, రష్యా దేశాలు తీవ్ర పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు రష్యా శుభవార్తను అందించింది. తాము రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను ఆగస్ట్‌ 10లోపు విడుదల చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశామని ప్రకటించింది.

తొలుత వైరస్‌ బారినపడిన వైద్యులకు సరఫరా చేసి, ఆ తరువాత ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని గురువారం ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సెషనోవ్‌ వర్సిటీ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్‌ తుది ప్రయోగాలను పూర్తి చేసుకునే దశలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. రష్యాలోని సెషనోవ్‌ వర్సిటీ తయారు చేసిన టీకా ప్రపంచంలోనే తొలి కరోనా నిరోధక టీకా అన్న వార్తలు ఇటీవల కాలంలో వెలువడ్డ విషయం తెలిసిందే..

మరోవైపు కరోనా కేసుల సంఖ్య ఒకవైపు పెరిగిపోతున్నప్పటికీ.. ఈ వ్యాధి కట్టడికి అత్యంత కీలకమైన వ్యాక్సిన్‌ విషయంలో ఆశలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకవైపు అమెరికన్‌ కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేస్తున్న టీకా మూడో దశ మానవ ప్రయోగాలు ప్రారంభమవ్వగా.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ టీకా కూడా కీలకమైన మూడో దశకు దగ్గరగా ఉండటంతో ఈ ఏడాది లోపు ఏదో ఒకటి కోవిడ్‌–19 నుంచి విముక్తి కల్పించవచ్చునన్న ఆశలు బలపడుతున్నాయి. ఇక భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న టీకా సైతం ఆగస్ట్‌ మూడో వారంలో సిద్ధమైయ్యే అవకాశం ఉందని ఐసీఎంఆర్‌ అంచనా వేస్తోంది.

Tags :
|
|
|

Advertisement