Advertisement

  • వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్న రష్యా

వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్న రష్యా

By: chandrasekar Fri, 21 Aug 2020 11:26 AM

వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్న రష్యా


రష్యా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ ఉత్పత్తికి భారత్ సాయం కోరింది. వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నట్లు ఆగస్టు 20 న పేర్కొంది. వ్యాక్సిన్‌ తయారీకి లాటిన్ అమెరికా, ఆసియా దేశాలతో పాటు మరికొన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ప్రస్తుతం తాము భారత్‌తో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని ఆర్‌డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రియేవ్ తెలిపారు. ‘కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఉత్పత్తిలో భారత్ భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నాం. వ్యాక్సిన్‌ తయారీ అనేది ఎంతో ముఖ్యమైన విషయం. భారత్ గమలేయ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలదని మేం నమ్ముతున్నాం. ప్రస్తుతం వ్యాక్సిన్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇండియా భాగస్వామ్యంతోనే వ్యాక్సిన్‌ను మేం సరఫరా చేయగలం’ అని దిమిత్రియేవ్ పేర్కొన్నారు.

ఈ విషయ౦ పై భారత్‌తో ఇప్పటికే చర్చలు జరిగాయని రష్యా ప్రభుత్వం వెల్లడించింది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేజ్-1, ఫేజ్‌-2 సాంకేతిక వివరాలను ఆర్‌డీఐఎఫ్‌ను భారత కంపెనీలు అడిగాయని. అన్ని అనుమతులు పూర్తి చేసుకున్న తరవాతే దేశీయంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తితో పాటు ఎగుమతికి అనుమతి కోరినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి. భారత్‌‌తో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, బ్రెజిల్‌లో కూడా స్పుత్నిక్‌-వి క్లినికల్ ట్రయల్స్‌ చేయాలని అనుకుంటున్నట్లు దిమిత్రియేవ్ తెలిపారు. ముఖ్యంగా ఆసియా, లాటిన్ అమెరికా, ఇటలీలో వ్యాక్సిన్‌కు అధిక డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. మొత్తం 5 దేశాల్లో వ్యాక్సిన్ తయారు చేయాలని భావిస్తున్నామని వెల్లడించారు.

Tags :
|

Advertisement