Advertisement

  • రష్యా స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌పై సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని ఫిర్యాదు

రష్యా స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌పై సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని ఫిర్యాదు

By: chandrasekar Sat, 19 Sept 2020 6:16 PM

రష్యా స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌పై సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని ఫిర్యాదు


ప్రపంచమంతా కరోనా వైరస్ తో పోరాడుతున్నారు. అందరు వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.. ఈ క్రమంలో రష్యా టీకాను విజయవంతంగా తయారు చేశామని దాని క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా పూర్తయ్యాయని ప్రకటించింది. వాటిని ప్రజలకు కూడా ఇవ్వడం ప్రారంభించింది. రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్-వీపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ వ్యాక్సిన్‌ తీసుకున్న కొంతమంది సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఏడుగురిలో ఒకరు తమకు జ్వరం, ఒంటినొప్పులు ఉన్నాయని రష్యా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి మురాష్కో తెలిపినట్లు బుధవారం మాస్కో టైమ్స్‌ తెలిపింది. మూడో విడత ట్రయల్స్‌లో భాగంగా ఎంపిక చేసిన 40వేల మంది వలంటీర్లలో 300 మందికిపైగా స్పుత్నిక్‌-వీ టాకా వేశామని మిఖాయిల్ మురాష్కో పేర్కొన్నారు. ఇందులో సుమారు 14శాతం మంది బలహీనత, కండరాల నొప్పి, జ్వరం తదితర ఫిర్యాదులు చేశారని తెలిపారు. కాగా, ఇవన్నీ తాము ముందుగానే ఊహించినవేనని చెప్పారు. మొదటి 21 రోజుల్లో అడెనో వైరస్‌ ఆధారిత వైరల్‌ వెక్టార్‌ వ్యాక్సిన్‌ రెండో షాట్‌ను వాలంటీర్లకు ఇస్తారు. స్పుత్నిక్‌ వీ ఇంకా క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేయలేదు. కానీ గత నెలలో రష్యన్‌ ప్రభుత్వం నుంచి ఆమోదం పొందింది.

స్పుత్నిక్ వ్యాక్సిన్ తుది క్లినికల్ ట్రయల్స్ ఈ నెల ప్రారంభంలో మాస్కోలో ప్రారంభమయ్యాయి. అయితే, పూర్తి భద్రత మరియు సమర్థత తనిఖీలను దాటని ఏదైనా షాట్‌ను ఉపయోగించొద్దని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయితే భారతదేశంలో ఈ వ్యాక్సిన్‌ మూడో విడత క్లినికల్‌ ట్రయల్స్‌తో పాటు పంపిణీకి హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఫార్మా సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) భారతదేశంలో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత డాక్టర్ రెడ్డీస్‌కు వంద మిలియన్ డోసుల వ్యాక్సిన్ సరఫరా చేయనున్నట్లు తెలిపింది. దీనిపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిగిన తర్వాతే అనుమతులు ఇస్తామని అధికారులు తెలిపారు. క్లినికల్‌ ట్రియల్స్‌ విజయవంతం పూర్తి చేసిన అనంతరం దేశంలో ఈ ఏడాది చివరి నాటికి టీకాలు అందరికీ ఇవ్వడం ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ అంతకు ముందు మాట్లాడుతూ కొవిడ్-19 వ్యాక్సిన్‌పై రష్యా నుంచి వస్తున్న డేటాను ఉన్నత స్థాయి ప్రభుత్వ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు.

Tags :
|

Advertisement