Advertisement

  • రష్యా కు షాక్ ...ఒలింపిక్స్ లో పాల్గొనకుండా నిషేధం

రష్యా కు షాక్ ...ఒలింపిక్స్ లో పాల్గొనకుండా నిషేధం

By: Sankar Fri, 18 Dec 2020 08:47 AM

రష్యా కు షాక్ ...ఒలింపిక్స్ లో పాల్గొనకుండా నిషేధం


క్రీడల్లో రష్యా కు ఊహించని షాక్ తగిలింది ..గత కొన్నేళ్లుగా డోపింగ్ ఆరోపణలతో తమ ప్రతిష్టతను దిగజార్చుకుంటూ వస్తున్న రష్యా కు ఈ సారి గట్టి దెబ్బె తగిలింది ...కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (కాస్‌) గురువారం రష్యాపై రెండేళ్ల నిషేధం విధించింది.

దీని ప్రకారం రానున్న రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో లేదా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఈవెంట్‌లలో రష్యా దేశానికి ప్రాతినిధ్యం ఉండదు. ఆ దేశం తరఫున ఎవరూ పాల్గొనడానికి వీల్లేదు. అంతేకాకుండా రెండేళ్ల పాటు ఎలాంటి క్రీడల ఆతిథ్య హక్కుల కోసం రష్యా బిడ్డింగ్‌లో పాల్గొనకూడదు.

అయితే డోపింగ్‌తో సంబంధం లేనట్లు నిరూపించుకునే రష్యా ఆటగాళ్లు వచ్చే ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్, 2022 బీజింగ్‌ వింటర్‌ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ టోర్నీల్లో తమ దేశం తరఫున కాకుండా ‘న్యూట్రల్‌’ అథ్లెట్లుగా పాల్గొనేందుకు అనుమతించింది...

Tags :
|
|
|

Advertisement