Advertisement

రష్యా లో రెండో కరోనా వ్యాక్సిన్ కు అనుమతి...

By: Sankar Thu, 15 Oct 2020 6:47 PM

రష్యా లో రెండో కరోనా వ్యాక్సిన్ కు అనుమతి...


కరోనా వైరస్ కు రష్యా ఇప్పటికే స్పుత్నిక్ వి పేరుతో వాక్సిన్ ను రిలీజ్ చేసింది. ఆగష్టు 11 వ తేదీన వాక్సిన్ ను ఆమోదిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే స్పుత్నిక్ వి వాక్సిన్ డోస్ లను ఉత్పత్తి చేస్తున్నారు.

మొదట దేశంలోని ప్రజలకు వాక్సిన్ ను వేసిన తరువాత బయట ప్రపంచదేశాలకు అందిస్తామని రష్యా అధ్యక్షుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఎపివాక్ కరోనా వైరస్ పేరిట రష్యా రెండో వాక్సిన్ కు కూడా అనుమతి ఇచ్చింది. ఎపివాక్ వాక్సిన్ కు అనుమతి ఇస్తున్నట్టు పుతిన్ మీడియాకు తెలిపారు. రెండో దశ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని, ఎపివాక్ వాక్సిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని, ఆరునెలలపాటు వైరస్ తో పోరాడే శక్తిని ఇస్తుందని అన్నారు.

స్పుత్నిక్ వి మాదిరిగానే రెండో దశ ప్రయోగాలు పూర్తికాగానే అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. స్పుత్నిక్ వి వాక్సిన్ పై కూడా ఇలాంటి విమర్శలు రావడంతో 40 వేలమందిపై మూడోదశ ప్రయోగాలను చేపట్టింది రష్యా. ఎపివాక్ వాక్సిన్ రష్యా ప్రజలకు త్వరలోనే అందుబాటులో ఉంచుతామని పుతిన్ పేర్కొన్నారు.

Tags :
|

Advertisement