Advertisement

కరోనా కోరలు పీకే వ్యాక్సిన్‌ తో రష్యా రెడీ

By: Dimple Tue, 11 Aug 2020 3:17 PM

కరోనా కోరలు పీకే వ్యాక్సిన్‌ తో రష్యా రెడీ

కంటికి కనిపించన శతృవుగా... తరతమ్యాల్లేకుండా.... ప్రపంచదేశాలకు కంటిమీద కునుకులేకుండా చేసిన కరోనావైరస్‌ కు కోరలు పీకేందుకు రష్యా రెడీ అయింది. దివ్యమైన ఔషధగుణాలతో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రపంచదేశాల్లో కరోనా కోరలుపీకే టీకాతో రికార్డును సొంతంచేసుకోబోతోంది. రష్యా వ్యాక్సిన్ పేరు తెలుసా... వైరల్ వెక్టర్ వ్యాక్సిన్ అని పిలుస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌నను బాడీకి ఇవ్వగానే... ఇది మనిషిలో వ్యాధి నిరోధక శక్తిని చురుగ్గా చేస్తుందట. దాంతో... కరోనా వైరస్ చుట్టూ ఉండే కొవ్వుతో కూడిన ముళ్లను నాశనం చేస్తుందని తెలిసింది. ఆ కొవ్వు, ముళ్లూ పోతే... కరోనా బతకదు. మనకు చర్మం ఎలాగో... దానికి అవి కవచ్చాల్లాంటివి. చిత్రమేంటంటే... చైనాలో కాన్సినో బయోలాజిక్స్ తయారుచేస్తున్న వ్యాక్సిన్ కూడా ఇలాగే పనిచేయబోతోంది. తమ వ్యాక్సిన్ తయారీ విధానాన్ని రష్యా హ్యాక్ చేసిందని ఆ మధ్య చైనా ఆరోపించింది. అయితే రష్యా ఆ ఆరోపణలు ఖండించింది.

మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న క్రమంలో అన్ని దేశాలూ కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే... ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను ఈనెల 12న రష్యా అధికారికంగా రిజిస్టర్‌ చేయనుంది. ఈ టీకాను గమలేయా పరిశోధన సంస్థ, రష్యా రక్షణ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షలు పూర్తిచేసుకుంటోంది. ప్రస్తుతం చివరి, మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ ఎంత భద్రమన్నది నిర్ణయించేందుకు ఈ ప్రక్రియ చాలా ముఖ్యం. మొదట వైద్య నిపుణులు, వృద్ధులకు టీకా ఇవ్వనున్నాం’’ అని ఆరోగ్యశాఖ సహాయమంత్రి ఒలెగ్‌ గ్రిడ్‌నేవ్‌ తెలిపారు.

ప్రపంచంలో కరోనా వైరస్‌కి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తొలి వ్యాక్సిన్‌గా ఇది రికార్డులకు ఎక్కుతుంది. కరోనా ఆటకట్టించేందుకు మందుకనిపెట్టడం గర్వనీయంగా ఉందనే భావన రష్యా ఉప ఆరోగ్యశాఖ మంత్రి ఒలెగ్‌ గ్రిడ్నెవ్‌ లో వ్యక్తమవుతోంది. ముందుగా దాదాపు 1,600 మంది డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, ముసలివాళ్లకు వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ రాకపోతే... అక్టోబర్ నుంచి దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

చాలా మంది రష్యా వ్యాక్సిన్‌ను నమ్మట్లేదు. ఎందుకంటే మూడు దశల్లో ట్రయల్స్ సరిగా నిర్వహించలేదనీ, పైపైన జరిపేసి... హడావుడిగా వ్యాక్సిన్ రిలీజ్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో కొంత నిజం ఉంది. ఇష్టమొచ్చినట్లు వ్యాక్సిన్ తయారుచేస్తే కుదరదనీ, గైడ్‌లైన్స్ ప్రకారం చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా రష్యా అధికారులకు చురకలంటించింది. రష్యా... అప్పటికే వ్యాక్సిన్ తయారీ ప్రారంభించేసింది. అంటే అనుమతులు లేకుండానే వ్యాక్సిన్ తయారుచేయసాగింది. ఎప్పుడైదే ప్రపంచ ఆరోగ్యసంస్థ గట్టిగా మొట్టికాయలు వేసిందో... అప్పుడు రష్యా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పద్ధతి ప్రకారమే అన్నీ చేయాలని డిసైడైంది. ఈ వ్యాక్సిన్ మొదటి దశలో జూన్ 17న 76 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చింది. రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే మూడో దశను ముగించబోతోంది. నిజానికి అంత త్వరగా చేయడం కరెక్టు కాదు. కానీ... వ్యాధి తీవ్రత పెరుగుతున్నందువల్ల షార్ట్‌కట్‌లో వాటిని పూర్తి చేస్తోంది. అందువల్ల ఈ వ్యాక్సిన్ సరిగా పనిచేస్తుందో, లేదో అనే డౌట్ కొంత ఉంది.

అంటువ్యాధుల నిపుణుడైన డాక్టర్ ఆంటోనీ ఫౌచీ... రష్యా, చైనాలకు ఓ హెచ్చరిక చేశారు. వ్యాక్సిన్లను ముందుగా కొద్ది మందికే ఇచ్చి, ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ లేకపోతే... ఎక్కువ మందికి ఇవ్వడం మేలన్నారు. హడావుడిగా చేసిన వ్యాక్సిన్ల వల్ల ఇబ్బందికరమనే అభిప్రాయం వ్యక్తంచేశారు. రష్యా తమ వ్యాక్సిన్‌ను ఏప్రిల్‌లోనే దేశంలోని కొంత మంది ప్రజలకు ఇచ్చిందనే ప్రచారం ఉంది. వ్యాక్సిన్ పొందిన వారిలో రాజకీయ, వ్యాపార ప్రముఖులు, సంపన్నులు ఉన్నట్లు తెలిసింది. రష్యాలో బిలియనీర్లు, ప్రభుత్వ అధికారులు కూడా ఆల్రెడీ వ్యాక్సిన్ డోసులు వేసుకున్నట్లు ప్రచారం ఉంది. ఇందుకు ఆధారాలు మాత్రం లేవు.

కరోనా కోరలు పీకే వ్యాక్సిన్‌ తో రష్యా రెడీ

russia,announces ,కరోనా కోరలు పీకే వ్యాక్సిన్‌ తో రష్యా రెడీ

కరోనా కోరలు పీకే వ్యాక్సిన్‌ తో రష్యా రెడీకంటికి కనిపించన శతృవుగా... తరతమ్యాల్లేకుండా.... ప్రపంచదేశాలకు కంటిమీద కునుకులేకుండా చేసిన కరోనావైరస్‌ కు కోరలు పీకేందుకు రష్యా రెడీ అయింది. దివ్యమైన ఔషధగుణాలతో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రపంచదేశాల్లో కరోనా కోరలుపీకే టీకాతో రికార్డును సొంతంచేసుకోబోతోంది. రష్యా వ్యాక్సిన్ పేరు తెలుసా... వైరల్ వెక్టర్ వ్యాక్సిన్ అని పిలుస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌నను బాడీకి ఇవ్వగానే... ఇది మనిషిలో వ్యాధి నిరోధక శక్తిని చురుగ్గా చేస్తుందట. దాంతో... కరోనా వైరస్ చుట్టూ ఉండే కొవ్వుతో కూడిన ముళ్లను నాశనం చేస్తుందని తెలిసింది. ఆ కొవ్వు, ముళ్లూ పోతే... కరోనా బతకదు. మనకు చర్మం ఎలాగో... దానికి అవి కవచ్చాల్లాంటివి. చిత్రమేంటంటే... చైనాలో కాన్సినో బయోలాజిక్స్ తయారుచేస్తున్న వ్యాక్సిన్ కూడా ఇలాగే పనిచేయబోతోంది. తమ వ్యాక్సిన్ తయారీ విధానాన్ని రష్యా హ్యాక్ చేసిందని ఆ మధ్య చైనా ఆరోపించింది. అయితే రష్యా ఆ ఆరోపణలు ఖండించింది.

Tags :
|

Advertisement