Advertisement

  • ఇంకా జీతాలు ఇవ్వకపోవడంపై మండిపడుతున్న ఆర్టీసీ యూనియన్లు

ఇంకా జీతాలు ఇవ్వకపోవడంపై మండిపడుతున్న ఆర్టీసీ యూనియన్లు

By: chandrasekar Sat, 12 Dec 2020 11:37 AM

ఇంకా జీతాలు ఇవ్వకపోవడంపై  మండిపడుతున్న ఆర్టీసీ యూనియన్లు


తెలంగాణాలో రాష్ట్ర ఖజానా నుంచి ఆర్టీసీ సంస్థకు డబ్బులు అందక పోవడంతో ఎంప్లాయిస్​కు జీతాలు ఇంకా ఇవ్వలేదని యూనియన్ లు మండిపడుతున్నాయి. ఈ నెల పదో తేదీ వచ్చినా ఎంప్లాయిస్​కు ఇంకా జీతాలు ఇవ్వకపోవడంపై ఆర్టీసీ యూనియన్లు తీవ్రంగా మండిపడుతున్నాయి. జీతాలు ఉద్యోగులకు చెల్లించకపోవడాన్ని ఎస్‌డబ్ల్యూఎస్‌ ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం కూడా ఖండించింది. రాష్ట్రంలో కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉందని ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు మండిపడ్డారు. ఇందువల్ల మేనేజ్‌మెంట్‌ వెంటనే జీతాలు చెల్లించాలని ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కమాల్‌ రెడ్డి కోరారు.

జీతాల విషయంలో యూనియన్లు మండిపాటుపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కర్నాటక మరియు మహారాష్ట్ర గురించి చెబుతున్నారని, మన తెలంగాణ గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పేర్కొన్నారు. జీతాలు లేటు అవడంపై ఉద్యోగులు టెన్షన్​పడాల్సిన అవసరం లేదని పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర ఆర్టీసీలో 5 నెలలుగా అలాగే కర్నాటకలో 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌లో తొలి దశలో భాగంగా హైదరాబాద్‌లో పార్సిల్‌, కొరియర్‌ హోం డెలివరీ సర్వీసులను ప్రారంభించారు. దీని ద్వారా మంచి లాభాలు వస్తున్నట్లు తెలిపారు.

అయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగ భద్రతపై సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే మంచి కబురు చెబుతామని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన ఆర్టీసీ కార్గో మరియు పార్సిల్ సర్వీసుకు మంచి ఆదరణ రావడంవల్ల ఆదాయం పెరిగిందని వీటి ద్వారా రోజుకు రూ.15లక్షల వరకు ఆదాయం రాష్ట్రానికి సమకూరుతోందని, మరికొన్ని రోజుల్లో ఆదాయం రూ.25లక్షలకు చేరుకుంటుందని అయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు కరోనా కారణంగా సంస్థకు ఏర్పడిన నష్టాల వల్ల చెల్లింపుల్లో లేటవుతున్నట్లు తెలుస్తుంది.

Tags :
|
|
|

Advertisement