Advertisement

  • ఏపీలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్ ..

ఏపీలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్ ..

By: Sankar Fri, 18 Sept 2020 2:06 PM

ఏపీలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్ ..


మార్చి 22 నుంచి ఏపీలో కరోనా కారణంగా బస్సులు రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే అన్ లాక్ లో భాగంగా, జిల్లాల మధ్య, రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ఏపీలోని జిల్లాల మధ్య బస్సులు తిరుగుతున్నాయి. అయితే, ఏపీలో సిటీ బస్ సర్వీసులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కరోనా వైరస్ కంట్రోల్ కాకపోవడంతో మొన్నటి వరకు సిటీ బస్సులకు అనుమతి ఇవ్వలేదు.

అయితే, ఇప్పుడు సిటీ సర్వీసులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మొదటి విడతగా విశాఖ, విజయవాడలో సిటీ బస్సులు నడపబోతున్నారు. రేపటి నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. అయితే, కరోనా నిబంధనలను పాటిస్తూనే బస్సులను నడపబోతున్నారు. బస్సుల్లో ఎక్కువ రద్దీ ఉండకుండా జాగ్రత్త తీసుకొని సిటీ బస్సులు నడపబోతున్నారు.

అయితే ఏపీ , తెలంగాణ మధ్య బస్సుల నిర్వహణ పైన ఉన్న సందిగ్దత మాత్రం ఇంకా అలానే ఉంది..ఇరు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ అధికారులు అనేక సార్లు చర్చలు జరిపినప్పటికీ ఇంకా ఏ విషయం కూడా కొలిక్కి రాలేదు...దీనితో ఈ విషయం మీద మరొకసారి చర్చలు జరపాలని అధికారులు నిర్ణయించారు..ఇక మరోవైపు హైదరాబాద్ లో ఇంకా సిటీ బస్సులు ప్రారంభం కాలేదు..

Tags :
|
|

Advertisement