Advertisement

  • త్వరలోనే మరొక సారి రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల చర్చలు

త్వరలోనే మరొక సారి రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల చర్చలు

By: Sankar Sun, 13 Sept 2020 7:14 PM

త్వరలోనే మరొక సారి రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల చర్చలు


కరోనా కారణంగా మార్చి 22 వ తేదీ నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్ సర్వీసులు ఆగిపోయిన సంగతి తెలిసిందే..ఆ తర్వాత దేశంలో లాక్ డౌన్ అమలు చేయడంతో బస్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. అన్ లాక్ లో భాగంగా రాష్ట్రాల మధ్య బస్ సర్వీసులు తిప్పేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కేంద్రం అనుమతి ఇచ్చినా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య బస్ సర్వీసులు నడవడం లేదు. ఇప్పటికే ఒకేసారి రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారు.

త్వరలోనే మరోసారి చర్చలు జరపబోతున్నట్టు ఏపీ రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. తెలంగాణకు బస్సులు నడిపేందుకు చర్చలు జరుపుతున్నట్టు అయన తెలిపారు. కర్ణాటకలో ఏపీ బస్సులు నడుస్తున్నాయని అన్నారు.

తెలంగాణ నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందని అన్నారు. తెలంగాణ ఏపీ మధ్య ఆర్టీసీ బస్సులు తక్కువగా తిరిగితే ప్రైవేట్ సర్వీసులు ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. తెలంగాణ ఎక్కువ సర్వీసులు నడిపినా తమకు అభ్యంతరం లేదని కృష్ణబాబు తెలిపారు.

Tags :
|
|
|
|

Advertisement