Advertisement

రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి రూ.2000

By: chandrasekar Sat, 28 Nov 2020 3:03 PM

రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి రూ.2000


రైతుల సహాయార్థం వారి అకౌంట్లలో రూ.2000 అందడానికి చేయవలసిందల్లా క్రింది విధంగా వున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏడో విడత నిధులు డిసెంబర్‌లో రానున్నాయి. ఇప్పటికే ఆ డబ్బు కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అవి వస్తే పంటలకు విత్తనాలు, పురుగు మందులూ కొనుక్కునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ డబ్బు డిసెంబర్‌లో లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా వస్తుంది. ఐతే ఏవైనా టెక్నికల్ సమస్యలు ఉంటే మనీ రాదు. అందువల్ల అలాంటివి లేకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏప్రిల్-జులై మధ్య కాలానికి మొదటి విడత నిధులు ఇవ్వగా ఆగస్ట్ నుంచి నవంబర్ నాటికి రెండో విడత నిధులు ఇచ్చారు. మూడో విడత డిసెంబర్ నుంచి మార్చి వరకూ ఉంటుంది. ఈ నిధులు డిసెంబర్‌లో రానున్నాయి.

ఇందుకోసం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి:

1. pmkisan.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి.

2. కుడివైపున రైతుల కార్నర్ 'Farmers Corner' ఉంటుంది. దాన్ని క్లిక్ చెయ్యండి.

3. ఇప్పుడు ఆప్షన్ 'option' నుంచి బెనెఫీషియర్ స్టేటస్ 'Beneficiary Status' క్లిక్ చెయ్యండి.

4. అక్కడ మీరు ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నంబర్ వంటివి ఇస్తే లబ్దిదారుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చూపిస్తుంది.

వెబ్ సైట్ లో చెప్పిన వివరాలు ఇచ్చాక సబ్ మిట్ కొట్టగానే లిస్టులో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. పేరు లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారా చెక్ చేసుకోవాలంటే ముందుగా మీరు పీఎం కిసాన్ మొబైల్ యాప్ 'PM Kisan Mobile App' డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి పై విధంగానే వివరాలు ఇవ్వాలి. తద్వారా మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. లబ్దిదారుల లిస్టులో మీ పేరు లేకపోతే మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేయవచ్చు. మీరు ఆరో విడత డబ్బు పొంది ఉంటే ఏడో విడత డబ్బు కూడా పొందగలరు. అందుకు మీ పేరు లిస్టులో ఉండాలి. లేకపోతే మాత్రం 011-24300606 హెల్ప్ లైన్ నంబర్‌కి కాల్ చేసి మీ సమస్య చెప్పవచ్చు. దాంతోపాటూ క్రింది నంబర్లకు కూడా కాల్ చేసి మీ సమస్య చెప్పుకునే వీలుంది.

పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266
పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్: 155261
పీఎం కిసాన్ లాండ్ లైన్ నంబర్స్: 011—23381092, 23382401
అదనపు పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్: 0120-6025109
పీఎం కిసాన్ ఈమెయిల్ ఐడీ: [email protected]

ఈ పథకం ద్వారా రైతులు కొంతవరకు లాభపడుతారు. పీఎం కిసాన్ పథకం రైతులను కష్టాల్లో ఆదుకుంటోంది. ఈ డబ్బుతో మూడు పంట కాలాల్లో మూడుసార్లు విత్తనాలు, పురుగుమందులను రైతులు కొంత వరకూ కొనుక్కోగలుగుతున్నారు. ఇందుకోసం రైతులు తమ ఆధార్ వివరాల్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది రైతులు ఆ వివరాలు ఇచ్చారు. ఇవ్వని వారు డిసెంబర్ 31 లోపు ఇవ్వాల్సి ఉంటుంది.

Tags :
|

Advertisement