Advertisement

రైతుల బ్యాంక్ అకౌంట్లోకి మళ్లీ రూ.2,000

By: chandrasekar Fri, 06 Nov 2020 3:49 PM

రైతుల బ్యాంక్ అకౌంట్లోకి మళ్లీ రూ.2,000


రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కి౦ద రైతులు రూ.6,000 పొందొచ్చు. అయితే ఈ డబ్బులు ఒకేసారి రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి రావు. మూడు విడతల వారీగా రైతుల ఖాతాల్లో క్రెడిట్ అవుతాయి. అంటే ఒక్కో విడత కింద రూ.2,000 చొప్పున ఏడాదిలో రూ.6 వేలు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో విడత అంటే ఏడో విడత కింద రైతులకు రూ.2,000 అందించడానికి రెడీ అవుతోంది. మరో 25 రోజుల తర్వాత రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు వచ్చి చేరతాయి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 7వ విడత రూ.2,000 డబ్బులు డిసెంబర్ నెల ఆరంభం నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి. కేంద్ర ప్రభుత్వం గత 23 నెలల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఏకంగా రూ.95 కోట్లు జమచేసింది. 11 కోట్ల మంది రైతులు నేరుగానే ప్రయోజనం పొందారు. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ డబ్బులు మూడు విడతల్లో రైతులకు అందుతాయి. డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు తొలి విడత డబ్బులు వస్తాయి. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రెండో విడత డబ్బులు లభిస్తాయి. ఇక ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 30 వరకు మూడో విడత డబ్బులు వస్తాయి.

Tags :
|

Advertisement