Advertisement

  • ఇన్‌స్పైర్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు రూ.10 వేలు

ఇన్‌స్పైర్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు రూ.10 వేలు

By: chandrasekar Sat, 05 Dec 2020 9:15 PM

ఇన్‌స్పైర్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు రూ.10 వేలు


దేశంలోని ప్రతి విద్యార్థి యొక్క శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వెలికి తీయడం కోసం ఇన్‌స్పైర్ పోటీలు నిర్వహించి వారికి బహుమతిగా డబ్బులు అందిస్తారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రతిభను వెలికితీసి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, శాస్త్ర సాంకేతిక మండలి, నేషనల్‌ ఇన్నోవేషన్‌ పౌండేషన్‌ సంయుక్తంగా ఏటా దేశంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఇన్‌స్పైర్‌– మనక్‌ పేరిట అవార్డులు అందిస్తున్నాయి. విద్యార్థులను బాల శాస్త్రవేతలుగా తీర్చిదిద్దడమే ఇన్‌స్పైర్‌– మనక్‌ వైజ్ఞానిక ప్రదర్శన ఉద్దేశం. పాఠశాల విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలను రేకెత్తించి వారిని పరిశోధన వైపు మళ్లించే ప్రతిష్ఠాత్మక ఇన్‌స్పైర్‌ పోటీలకు సంబంధించి గత విద్యా సంవత్సరానికి (2019-20) సంబంధించిన పోటీలను ఈసారి ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. సాధారణంగా ఇన్‌స్పైర్‌ ప్రాజెక్టుల ప్రదర్శనలు అన్నిస్థాయిల్లో ఎంతో సందడి జరుగుతాయి. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తితో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాంతో పోటీ ప్రదర్శనలు ప్రస్తుతం ఆన్‌లైన్‌కు మాత్రమే పరిమితమయ్యాయి. మాములుగా అయితు మన రాష్ట్రంలో జిల్లా, రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ పోటీలు ఈ సంవత్సరం జనవరిలోనే పూర్తి కావాలి. ఏపీలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించిన తెలంగాణలో మాత్రం జరగలేదు. ఈ మార్చి చివరి వారంలో లాక్‌డౌన్‌తో ఈ ప్రదర్శనల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారింది. జూన్‌ నెలలో ఆన్‌లైన్‌లో జరుపాలని ఎస్‌సీఈఆర్‌టీ నిర్ణయించినా ముందుకు సాగలేదు.

ప్రస్తుతం కరోనా వల్ల వాయిదాపడ్డ ఈ పోటీ డిసెంబరులో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ కావడంతో పోటీల నిర్వహణకు మార్గం సుగమం అయింది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో విద్యార్థులు తమ ప్రదర్శనలను అప్‌లోడ్‌ చేస్తే వాటిని జడ్జీలు చూసి విజేతలను ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయి పోటీలు డిసెంబ‌రు 14-17 తేదీల మధ్య పూర్తి అయ్యేలా చూడాలని డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 3,472 ప్రాజెక్టులు పోటీపడనున్నాయి. అందులో 10 శాతం ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర పోటీలు ఈ నెలాఖరులో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2020-21) సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే 6-10 తరగతుల విద్యార్థుల నుంచి 24,061 దరఖాస్తులు అందాయి. వాటిని పరిశీలించి ఎన్‌ఐఎఫ్‌ ప్రతినిధులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రతిభను వెలికితీసి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, శాస్త్ర సాంకేతిక మండలి, నేషనల్‌ ఇన్నోవేషన్‌ పౌండేషన్‌ సంయుక్తంగా ఏటా దేశంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఇన్‌స్పైర్‌–మనక్‌ పేరిట అవార్డులు అందిస్తున్నాయి. ఈ పథకానికి ఎంపికైన విద్యార్ధుల ప్రాజెక్టుల తయారీకి రూ. 10 వేల సాయం అందిస్తోంది. ఈ పోటీని జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిల్లో నిర్వహిస్తారు. ప్రతిభ కలిగిన విద్యార్థులు ఇందులో విజయం సాదించవచ్చును.

Tags :
|

Advertisement