Advertisement

  • రూ.10వేల వరద సాయంపై రచ్చ...క్లారిటీ ఇచ్చిన కేటీఆర్...

రూ.10వేల వరద సాయంపై రచ్చ...క్లారిటీ ఇచ్చిన కేటీఆర్...

By: chandrasekar Thu, 19 Nov 2020 6:10 PM

రూ.10వేల వరద సాయంపై రచ్చ...క్లారిటీ ఇచ్చిన కేటీఆర్...


జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో రూ.10వేల వరద సాయంపై గొడవ జరుగుతోంది. వరద బాధితులను ఆదుకోవచ్చని ఎన్నికల నోటిఫికేషన్ విడుదల రోజు చెప్పిన ఎన్నికల సంఘం.. ఆ మరుసటి రోజే యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందన వరద సాయం పంపిణీ, దరఖాస్తుల స్వీకరణను నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. వరద సాయం పంపిణీని డిసెంబరు 4 తర్వాత పంపిణీ చేసుకోవచ్చని తెలిపింది. ఈ క్రమంలో ఎన్నో ఆశలతో మీ సేవల ముందు క్యూకట్టిన నగరవాసులు.. ఎన్నికల సంఘం నిర్ణయంతో షాక్ తిన్నారు. ఎన్నికల తర్వాత డబ్బులు ఇస్తారో లేదోనని ఆందోళన పడుతున్నారు.

ఈ క్రమంలో వరద సాయం డబ్బులపై మంత్రి కేటీఆర్ స్పష్టతనిచ్చారు. గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వరద సాయం నిలిచిపోయింది. డబ్బుల పంపిణీ వల్ల టీఆర్ఎస్‌కు మేలు జరుగుతుందని కాంగ్రెస్ లేదా బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఆపేశారు. అర్హులైన వరద బాధితులందరికీ వరద సాయం అందుతుందని స్పష్టం చేశారు. ఇంకో రూ. 100 కోట్లు ఖర్చుచేసైనా సరే వారిని ఆదుకుటామని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్. అక్టోబరు రెండో వారంలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఎంతో నష్టపోయారు. ఆ వరద బాధితులను ఆదుకుంటామన్న సీఎం కేసీఆర్ఇ ళ్లు కూలిపోయిన వారికి రూ.లక్ష, దెబ్బతిన్న వారికి రూ. 50 సాయం అందజేస్తామని ప్రకటించారు.

అంతేకాదు వరద వల్ల ఇబ్బందులు పడిన ప్రతి కుటుంబానికి రూ.10వేల సాయం ప్రకటించారు. చెప్పినట్లుగా గానే కొన్ని చోట్ల నేరుగా ఇళ్లకు వెళ్లి బాధితులకు డబ్బు పంపిణీ చేశారు. ఐతే వరద సాయం డబ్బులను కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు కాజేశారని చాలా మందికి డబ్బులు అందలేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. వరద సాయం అందని వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ మరుసటి రోజు నుంచే మీ సేవాలకు జనం క్యూకట్టారు. కిలో మీటర్ల మేర వరద బాధితులు బారులు తీరారు. ఐతే అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం నుంచి వరద సాయం నిలిపివేశారు. ఎన్నికల తర్వాతే వరద సాయం డబ్బులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఐతే వరద సాయం నిలిపివేయడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి మీరేంటే మీరే కారణమని.. టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. వరద సాయం అంశంపైనే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి.

Tags :
|
|
|
|
|

Advertisement