Advertisement

  • నిరుద్యోగులు ఎదురు చూస్తున రైల్వే ఎన్టీపీసీ పరీక్ష అప్లికేషన్ స్టేటస్ లింక్ ఓపెన్

నిరుద్యోగులు ఎదురు చూస్తున రైల్వే ఎన్టీపీసీ పరీక్ష అప్లికేషన్ స్టేటస్ లింక్ ఓపెన్

By: Sankar Mon, 21 Sept 2020 4:58 PM

నిరుద్యోగులు ఎదురు చూస్తున రైల్వే ఎన్టీపీసీ పరీక్ష అప్లికేషన్ స్టేటస్ లింక్ ఓపెన్


రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఎన్టీపీసీ 2020 అప్లికేషన్‌ స్టేటస్‌ను అభ్యర్థులు చెక్ చేసుకునేందుకు వీలుగా లింక్‌ను సోమవారం యాక్టివేట్‌ చేసింది. సెప్టెంబర్‌ 30వ తేదీ వరకూ అభ్యర్థులు తమ దరఖాస్తు స్టేటస్‌ను చూసుకోవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు ఏ జోన్‌కు దరఖాస్తు చేసుకున్నారో ఆ సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.

ఆర్‌ఆర్‌బీ కోల్‌కతా, ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్, ఇతర జోన్ల అధికారిక వెబ్‌సైట్‌లో ఈ లింక్‌ ఓపెన్‌ ఉంటుంది. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్ష డిసెంబర్ 15, 2020 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 1.24 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

నిరుద్యోగులు దాదాపు ఏడాదిన్నరగా ఈ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు..అయితే అనుకోని కారణాల వలన ఈ పరీక్షా ఆలస్యం అవుతూ వస్తుంది..ఆ లోపు కరోనా మహమ్మారి విజృంభణతో దాదాపు ఏడు నెలలుగా ఈ పరీక్ష గురించి ఎటువంటి సమాచారంలేదు ..దీనితో అభ్యర్థుల నుంచి నిరసన వ్యక్తం అవడం తో రైల్వే బోర్డు ఇటీవలే డిసెంబర్ లో పరీక్షలు మొదలవుతాయి అని ప్రకటించింది..ఇపుడు అప్లికేషన్ స్టేటస్ కూడా రావడంతో నిరుద్యోగులు ఆనందంలో ఉన్నారు

Tags :
|
|
|

Advertisement