Advertisement

  • రోహిత్ ను కెప్టెన్ గా నియమించాల్సిన సమయం వచ్చింది...గౌతమ్ గంభీర్

రోహిత్ ను కెప్టెన్ గా నియమించాల్సిన సమయం వచ్చింది...గౌతమ్ గంభీర్

By: Sankar Wed, 11 Nov 2020 2:00 PM

రోహిత్ ను కెప్టెన్ గా నియమించాల్సిన సమయం వచ్చింది...గౌతమ్ గంభీర్


ఐపీఎల్-2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ఐదో టైటిల్‌ను కైవసం చేసుకుంది ముంబై ఇండియన్స్. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అలాగే మైదానంలో సూపర్ కెప్టెన్సీతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్‌ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని, అతడిని భారత వన్డే జట్టుతో పాటు టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ‘

ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలోనే రోహిత్ అత్యంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్. ఒకవేళ అతడికి ఇప్పటికీ వన్డే, లేదా టీ20 కెప్టెన్సీ అప్పగించకవడం సిగ్గుపడాల్సిన విషయం. కనీసం టీ20లకైనా రోహిత్‌ను కెప్టెన్ చేయాలి’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన ఐపీఎల్-2020 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన వరుసగా రెండో సారీ టోర్నీ విజేతగా నిలిచింది.

తొలుత సూపర్ బౌలింగ్‌తో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించింది. దీంతో శ్రేయాస్ జట్టు కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. 157 పరుగుల టార్గెట్‌ను ముంబై సునాయాసంగా ఛేదించింది. ఛేదనలో రోహిత్(68) క్లాసీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

Tags :
|

Advertisement