Advertisement

  • జట్టు యాజమాన్యం ఎక్కడ బ్యాటింగ్ చేయమంటే అక్కడ బ్యాటింగ్ చేస్తా ...రోహిత్ శర్మ

జట్టు యాజమాన్యం ఎక్కడ బ్యాటింగ్ చేయమంటే అక్కడ బ్యాటింగ్ చేస్తా ...రోహిత్ శర్మ

By: Sankar Mon, 23 Nov 2020 06:36 AM

జట్టు యాజమాన్యం ఎక్కడ బ్యాటింగ్ చేయమంటే అక్కడ బ్యాటింగ్ చేస్తా ...రోహిత్ శర్మ


జట్టు అవసరాలకి అనుగుణంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఏ స్థానంలోనైనా ఆడేందుకు తాను సిద్ధమని భారత స్టార్‌ ప్లేయర్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.

ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో గాయం నుంచి కోలుకుంటోన్న రోహిత్‌... తాను టీమిండియాతో కలిసే సమయానికల్లా జట్టులో తన బ్యాటింగ్‌ స్థానం ఖరారు అవుతుందని పేర్కొన్నాడు. ‘గతంలో ఎన్నోసార్లు చెప్పిందే మళ్లీ చెప్తున్నా. జట్టు యాజమాన్యం ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయమంటే అక్కడ సంతోషంగా ఆడతా.

ఓపెనర్‌గా నా స్థానాన్ని మారుస్తారో? లేదో? నాకు తెలియదు. విరాట్‌ కోహ్లి భారత్‌కు వచ్చేశాక ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలనే అంశంపై ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఉన్న మా జట్టు ఓ అంచనాకు వచ్చిందని అనుకుంటున్నా. అక్కడికి వెళ్లాకే నాకూ నా స్థానంపై స్పష్టత వస్తుంది’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా వరుసగా డబుల్‌ సెంచరీ, సెంచరీతో చెలరేగిన రోహిత్‌ శర్మ... సంప్రదాయ క్రికెట్‌లో రాణించేందుకు ప్రాథమిక అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పాడు.

Tags :
|
|

Advertisement