Advertisement

  • ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్ ను సాధించిన రోహిత్ శర్మ...!

ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్ ను సాధించిన రోహిత్ శర్మ...!

By: chandrasekar Fri, 06 Nov 2020 11:09 AM

ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్ ను సాధించిన రోహిత్ శర్మ...!


ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌటైన ఆటగాడిగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రోహిత్ అశ్విన్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో రోహిత్ బలహీనతను ఉపయోగించుకుంటూ ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అశ్విన్‌ను బరిలో దింపాడు. అశ్విన్ విసిరిన బంతికి రోహిత్ వికెట్ల ముందు ఎల్బీగా దొరికిపోయాడు. దీంతో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. రోహిత్ ఐపీఎల్‌లో డకౌట్ కావడం ఇది 13వ సారి కావడం గమనార్హం. ఇప్పటి వరకూ పార్థీవ్ పటేల్, హర్భజన్ సింగ్ మాత్రమే 13సార్ల చొప్పున ఐపీఎల్‌లో డకౌటయ్యారు.

2018 వరకు ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా గోల్డెన్ డకౌట్ కాని రోహిత్.. 2018 నుంచి ఇప్పటి వరకూ నాలుగుసార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగోస్థానంలో ఉన్న రోహిత్.. నాకౌట్స్‌ లేదా ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. నాకౌట్ లేదా ప్లేఆఫ్‌ల్లో ఇప్పటి వరకూ 19 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్.. కేవలం 12.72 సగటు, 101.32 యావరేజ్‌తో 229 రన్స్ చేశాడు. అందులో 3 డకౌట్లు ఉన్నాయి. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన రోహిత్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు హిట్ మ్యాన్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల చర్చ జరుగుతున్న తరుణంలో అతడు పేలవ రీతిలో అవుటవుతుండటం అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రోహిత్ ఫెయిల్ అయినప్పటికీ మిగతా బ్యాట్స్‌మెన్ మెరవడంతో ముంబై ఇండియన్స్ 200 పరుగులు చేసింది.

Tags :
|
|

Advertisement