Advertisement

  • టీమిండియాకు శుభవార్త ..ఆస్ట్రేలియా బయల్దేరిన రోహిత్ శర్మ

టీమిండియాకు శుభవార్త ..ఆస్ట్రేలియా బయల్దేరిన రోహిత్ శర్మ

By: Sankar Tue, 15 Dec 2020 6:08 PM

టీమిండియాకు శుభవార్త ..ఆస్ట్రేలియా బయల్దేరిన రోహిత్ శర్మ


ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియాకు భారీ ఊరట ...టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ నిరూపించుకొని నేడు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కాడు...దీనితో తొలి టెస్ట్ తర్వాత కోహ్లీ సేవలను కోల్పోతున్న టీమిండియాకు ఇది గొప్ప శుభపరిమాణం.....

మంగ‌ళ‌వారం తెల్ల‌వారుఝామున దుబాయ్ మీదుగా అత‌డు ఆస్ట్రేలియా వెళ్లిన‌ట్లు బోర్డు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అక్క‌డ క్వారంటైన్‌లో ఉండాల్సి రావ‌డంతో ఆ స‌మ‌యంలో త‌న ఫిట్‌నెస్ మ‌రింత దృష్టి సారించ‌నున్నాడు. క్వారంటైన్ నిబంధ‌న‌ల కార‌ణంగా రోహిత్ తొలి రెండు టెస్టుల‌కు దూరం కానున్నాడు.

మొద‌ట్లో మిగ‌తా టీమ్ స‌భ్యుల‌తోనే క‌లిసి రోహిత్‌ను ఆస్ట్రేలియా పంపించాల‌ని బోర్డు భావించినా.. త‌ర్వాత నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో అత‌ను ఫిట్‌నెస్ కోసం కృషి చేశాడు. గ‌త శుక్ర‌వారం అత‌నికి ఫిట్‌నెస్ ప‌రీక్ష నిర్వ‌హించిన ఎన్‌సీఏ ఫిజియోలు.. రోహిత్‌కు క్లీన్‌చిట్ ఇచ్చారు. జ‌న‌వ‌రి 7న సిడ్నీలో ప్రారంభ‌మ‌య్యే మూడో టెస్ట్ స‌మ‌యానికి రోహిత్ టీమ్‌కు అందుబాటులో ఉంటాడు.

Tags :

Advertisement