Advertisement

లవ్ యూ ఫరెవర్ అంటున్న హిట్‌మ్యాన్‌ ..

By: Sankar Mon, 21 Dec 2020 5:29 PM

లవ్ యూ ఫరెవర్ అంటున్న హిట్‌మ్యాన్‌ ..


ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ప్రస్తుతం అతడు తప్పనిసరి క్వారంటైన్‌లో ఉన్నాడు.

ఇక రోహిత్‌ భార్య రితికా సోమవారం పుట్టినరోజు జరుపుకుంటున్నది. రితికా బర్త్‌డే సందర్భంగా తనతో దిగిన ఫొటోలను రోహిత్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 2015లో వీరిద్దరూ వివాహం చేసుకోగా ఒక కుమార్తె సమైరా ఉంది. ఐదు సూపర్‌ క్యూట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూనే 'హ్యాపీ బర్త్‌డే డార్లింగ్‌. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని' హిట్‌మ్యాన్‌ వ్యాఖ్యానించాడు.

క్వారంటైన్‌ పూర్తైన తర్వాత భారత ఆటగాళ్లతో ప్రాక్టీస్‌ అనంతరం ఆసీస్‌తో మూడు, నాలుగో టెస్టుల్లో రోహిత్‌ బరిలో దిగనున్నాడు. భారత్‌,ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు డిసెంబర్‌ 26 నుంచి మొదలవనుంది. తొలి టెస్ట్ లో దారుణ ఓటమితో టీం ఇండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది ..ఇక రెండో టెస్ట్ నుంచి కెప్టెన్ కోహ్లీ కూడా దూరమవడంతో సీనియర్ అయిన రోహిత్ మీద భారీ అంచనాలే ఉన్నాయి...

Tags :
|
|

Advertisement