Advertisement

  • రోహిత్ చాల కష్టపడేతత్వం ఉన్న ఆటగాడు ..జట్టుకే తొలి ప్రాధాన్యత ఇస్తాడు ..ఇర్ఫాన్ పఠాన్

రోహిత్ చాల కష్టపడేతత్వం ఉన్న ఆటగాడు ..జట్టుకే తొలి ప్రాధాన్యత ఇస్తాడు ..ఇర్ఫాన్ పఠాన్

By: Sankar Mon, 29 June 2020 1:34 PM

రోహిత్ చాల కష్టపడేతత్వం ఉన్న ఆటగాడు ..జట్టుకే తొలి ప్రాధాన్యత ఇస్తాడు ..ఇర్ఫాన్ పఠాన్



ఇండియన్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మీద ఆసక్తికర వాఖ్యలు చేసాడు మాజీ స్టార్ అల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ..రోహిత్ ను మైదానంలో చూస్తే ఎక్కువగా కష్టపడడేమో అనుకుంటారు కానీ రోహిత్ చాల హార్డ్ వర్క్ చేస్తాడు అని అన్నాడు ..అయితే తనకు ఉన్న ప్రత్యేక టైమింగ్ వలన రోహిత్ బ్యాటింగ్ చేసేప్పుడు ఆలా లెజిగా కనిపిస్తాడు అని అన్నాడు ఈ బరోడా పేసర్ ..వసీం జాఫర్ విషయంలో ఇదే వరిస్తుంది అని అన్నాడు ..షాట్లు ఆడేప్పుడు గాని , రన్నింగ్ చేసేప్పుడు గాని వీళ్లకు ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ వలన ఆలా కనిపిస్తారు అంత మాత్రాన వాళ్ళు కష్టపడటం లేదు అని కాదు అని పఠాన్ వ్యాఖ్యానించాడు ..

రోహిత్ ఆట చూస్తే అతను ఎందుకు హార్డ్‌ వర్క్‌ చేయడం లేదనే ఆలోచనే మనకు వస్తుంది. కానీ అతను చాలా హార్డ్‌ వర్క్‌ చేస్తున్నాడు అనే విషయం మనకు కనబడదు. ఇక్కడ రోహిత్‌కు గురించి కూడా చాలా మంది ఇలా అభిప్రాయపడ్డారు. రోహిత్‌ ఎక్కువ కష్టించాలనే సూచించారు. కానీ రోహిత్‌లో పోరాటే తత్వం చాలా ఎక్కువ. అతను ఎప్పుడూ మనం మరింత కష్టపడాలని చెబుతూ ఉండేవాడు.

జట్టు కోసం తొలి ప్రాధాన్యత ఇస్తాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా అతని ఘనతలు చూశాం. భారత జట్టులో రోహిత్‌ శర్మ కీలక ఆటగాడు కావడానికి అతని పట్టుదలే కారణం. ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్‌కప్‌లో అతనికి జట్టులో స్థానం కల్పించకపోవడమే మరింత శ్రమించేలా చేసింది’ అని ఇర్ఫాన్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టడ్‌ షోలో పేర్కొన్నాడు.

Tags :
|
|
|

Advertisement