Advertisement

  • స్టేడియం బయట వెళ్తున్న బస్సు మీదకు భారీ సిక్సర్ కొట్టిన హిట్ మాన్ రోహిత్

స్టేడియం బయట వెళ్తున్న బస్సు మీదకు భారీ సిక్సర్ కొట్టిన హిట్ మాన్ రోహిత్

By: Sankar Wed, 09 Sept 2020 7:22 PM

స్టేడియం బయట వెళ్తున్న బస్సు మీదకు భారీ సిక్సర్ కొట్టిన హిట్ మాన్ రోహిత్


టీమిండియా ఆట‌గాడు.. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అంటేనే భీక‌ర‌మైన‌ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. బ్యాటింగ్ ఆడేట‌ప్పుడు రోహిత్ శ‌ర్మ ఎంత క‌సిగా ఉంటాడ‌నేది ఇప్ప‌టికే చాలాసార్లు చూశాం. అత‌ను బంతిని బ‌లంగా బాదాడంటే.. స్టేడియం అవ‌త‌ల ప‌డాల్సిందే. తాజాగా దుబాయ్ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 19 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ 13వ సీజ‌న్‌కు స‌న్న‌ద్ద‌మ‌య్యేందుకు ఆట‌గాళ్లు త‌మ ప్రాక్టీస్‌ను కొన‌సాగిస్తున్నారు. కాగా ఈ సీజ‌న్‌లో చెన్నైతో జ‌రిగే మొద‌టి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డనున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అబుదాబి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒక‌టి ఆ జ‌ట్టు యాజ‌మాన్యం షేర్ చేసింది. ఆ వీడియోలో బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్న రోహిత్ స్పిన్న‌ర్ వేసిన బంతిని బారీ సిక్స్‌గా మ‌లిచాడు. 95 మీట‌ర్ల ఎత్తులో వెళ్లిన ఆ బంతి స్టేడియం బ‌య‌ట‌కు వెళ్లి రోడ్డు మీద వెళ్తున్న బ‌స్సు రూఫ్‌టాప్‌పై ప‌డింది.

ఇంకేముంది.. బౌలింగ్ వేసిన స్పిన్న‌ర్ బిత్త‌ర‌చూపులు చూడగా.. రోహిత్ విజ‌య‌సంకేతం చూపించాడు. దాదాపు నాలుగు నెల‌ల త‌ర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేప‌ట్టిన రోహిత్ బారీ షాట్ల‌తో రీచార్జ్ అయిన‌ట్లే క‌నిపిస్తుంది. రానున్న మ్యాచ్‌లో త‌న విధ్వంసం ఎలా ఉండ‌బోతుందో చెప్ప‌క‌నే చెప్పాడు.

Tags :
|
|

Advertisement