Advertisement

  • వరుసగా ఎనిమిదో ఏడాది కూడా ఆ రికార్డు రోహిత్ పేరిటే...

వరుసగా ఎనిమిదో ఏడాది కూడా ఆ రికార్డు రోహిత్ పేరిటే...

By: Sankar Wed, 02 Dec 2020 4:47 PM

వరుసగా ఎనిమిదో ఏడాది కూడా ఆ రికార్డు రోహిత్ పేరిటే...


భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్ డే క్రికెట్ లో ఎంతటి విధ్వంసక ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...ఒక్కసారి క్రీజ్ లు కుదురుకుంటే రోహిత్ ను అవుట్ చేయడం అంత సామాన్యమైన విషయం కాదు..అందుకే ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని విధంగా వన్ డే లలో మూడు డబల్ సెంచరీలు చేసాడు...అంతే కాకుండా గత ఎనిమిది ఏళ్లుగా ఇండియా తరుపున వన్ డే క్రికెట్ లో అత్యధిక స్కోర్ రికార్డు కూడా రోహిత్ పేరిట ఉంది...

ఈ ఏడాది జనవరి 19న బెంగళూరులో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ చేసిన 119 పరుగులే 2020 లో ఒక భారతీయుడు ఒక ఇన్నింగ్స్ లో సాధించిన అత్యధిక వన్డే స్కోరు. ఆ తర్వాత ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో హార్దిక్ పాండ్యా (92) తో రెండో స్థానంలో నిలిచాడు..

ఇక టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ ఏడాది ఒక్క సెంచరీ కూడా చేయకుండానే ముగించాడు..దీనితో పన్నెండు ఏళ్ళ తర్వాత కోహ్లీ ఒక ఏడాది లో సెంచరీ చేయకుండ ముగించాడు...అంతే కాకుండా ఈ రోజు జరుగుతున్న మూడో వన్ డే లో అర్థ సెంచరీ చేసిన కోహ్లీ , అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 12000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు...

Tags :
|
|

Advertisement