Advertisement

  • కొత్త పాయింట్‌తో బీసీసీఐని మళ్లీ టార్గెట్ చేసిన రోహిత్ ఫ్యాన్స్...

కొత్త పాయింట్‌తో బీసీసీఐని మళ్లీ టార్గెట్ చేసిన రోహిత్ ఫ్యాన్స్...

By: chandrasekar Tue, 10 Nov 2020 2:51 PM

కొత్త పాయింట్‌తో  బీసీసీఐని మళ్లీ టార్గెట్ చేసిన రోహిత్  ఫ్యాన్స్...


ఎలాగైతేనేం హిట్ మ్యాన్ రోహిత్ ఆస్ట్రేలియా టూర్‌‌కు ఎంపికైయ్యాడు. మాజీల, అభిమానుల విమర్శల మధ్య బీసీసీఐ అతడికి టెస్ట్ జట్టులో చోటు కల్పించింది. వన్డే, టీ20 సిరీస్‌లకు మాత్రం సెలెక్ట్ చేయలేదు. ఆస్ట్రేలియా టూర్‌కు రోహిత్‌ను ఎంపిక చేయలేదని తిట్టిపోసిన ఫ్యాన్స్.. ఇప్పుడు కొత్త పాయింట్‌తో బీసీసీఐని మళ్లీ టార్గెట్ చేసుకున్నారు.

రోహిత్ ఆస్ట్రేలియా టూర్ విషయంలో ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి౦ది. రోహిత శర్మ వన్డే , టీ20 సిరీస్ ఆడడు. టెస్ట్ సిరీస్‌లో మాత్రం ఆడుతాడు. ఐతే మొదటి టెస్ట్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ కొహ్లీ పితృత్వపు సెలవుతో తిరిగి ఇండియాకు వస్తాడు. ఆ సమయంలో జట్టుకు ఎవరు కెప్టెన్‌గా ఉంటారన్న దానిపైనే తాజాగా గొడవ మొదలయ్యింది.

బీసీసీఐ ప్రకటించిన టెస్ట్ జట్టులో విరాట్ కొహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా ప్రకటించారు. ఒకవేళ కెప్టెన్ అందుబాటులో లేకుంటే ఆ బాధ్యతలు వైఎస్ కెప్టెన్ తీసుకుంటాడు. ఈ లెక్కన కొహ్లీ ఇండియాకు వస్తే అజింక్య రహానే కెప్టెన్‌గా ఉంటాడు. ఇక్కడే రోహిత్ అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మను టెస్ట్ టీమ్‌లోకి తీసుకున్నారు. అంత వరకు ఓకే. వైఎస్ కెప్టెన్ ఎందుకు చేయలేదని నిలదీస్తున్నారు. రహానే కెప్టెన్‌లో రోహిత్ శర్మ ఆడాలా? అంటూ మండిపడుతున్నారు.

రహానే కంటే రోహిత్ శర్మే కెప్టెన్సీ బాగా చేస్తాడని.. బీసీసీఐ తీరు అభ్యంతరకరంగా ఉందని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతడి వ్యాఖ్యల ఆధారంగా రోహిత్ అభిమానులు ట్వీట్ల మోత మోగిస్తున్నారు. కొహ్లీ లేకుంటే అతడి స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా వరుసగా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది టీమిండియా. నవంబరు 27 నుంచి మూడు వన్డేలు, డిసెంబరు 4 నుంచి మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. అంతేకాదు ఆస్ట్రేలియాతో తొలిసారి డే/నైట్‌ టెస్టులో తలపడనుంది టీమిండియా. డిసెంబర్‌ 17-21 వరకు అడిలైడ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్‌ (26-30), సిడ్నీ (జనవరి 7-11, 2021), బ్రిస్బేన్‌ (జనవరి 15-19)లో తదుపరి మ్యాచ్‌లు జరుగుతాయి.

టీం ఇండియా టెస్ట్ స్క్వాడ్: విరాట్ కొహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), జాస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, నవదీప్ సైని, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, మహమ్మద్ సిరాజ్.


Tags :
|
|
|
|
|

Advertisement