Advertisement

కోహ్లి ట్వీట్కు కామెంట్ చేసిన రోహిత్

By: chandrasekar Sat, 29 Aug 2020 4:38 PM

కోహ్లి ట్వీట్కు కామెంట్ చేసిన రోహిత్


సోషల్ మీడియా ద్వారా విరాట్‌ కోహ్లి అనుష్క శర్మ గర్భం దాల్చినట్లు గురువారం ప్రకటించాడు. దీంతో కోహి, అనుష్క శర్మలకు ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. ‘ఇద్దరికీ శుభాకాంక్షలు. మీ కొత్త ఇన్నింగ్స్‌కు బెస్ట్‌ విషెస్‌’ అని రోహిత్‌ కోహ్లి ట్వీట్‌కు కామెంట్‌ చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఏకంగా ఐదు శతకాలు కొట్టిన రోహిత్ శర్మ ఒంటిచేత్తో టీమిండియాని సెమీ ఫైనల్‌కి చేర్చాడు. కానీ న్యూజిలాండ్‌తో జరిగిన ఆ సెమీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు భారత్ ఓటమికి కారణ౦ ఐయ్యింది.

టోర్నీలో కెప్టెన్ కోహ్లీ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన రోహిత్ శర్మ టీమ్‌ కంటే ముందుగానే ఒంటరిగా ఇంగ్లాండ్ నుంచి భారత్‌కి చేరుకున్నాడు. ఇదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శర్మని అనుష్క శర్మ అన్‌ఫాలో చేసింది. నిమిషాల వ్యవధిలోనే రోహిత్ శర్మ కూడా అనుష్కని ఫాలో చేయడం మానేశాడు. దాంతో కోహ్లీ, రోహిత్ మధ్య దూరం మరింత పెరిగిందని అందరు అనుకున్నారు. తాజాగా అనుష్క శర్మని తన ట్వీట్‌లో ప్రస్తావించడం ద్వారా తమ మధ్య ఇప్పడు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేసాడు రోహిత్ శర్మ.

Tags :
|
|

Advertisement