Advertisement

  • ఫాంటసీ టీం తయారుచేసుకో ...అభిమానికి చురకలు అంటించిన రోహన్ గవాస్కర్

ఫాంటసీ టీం తయారుచేసుకో ...అభిమానికి చురకలు అంటించిన రోహన్ గవాస్కర్

By: Sankar Sun, 20 Dec 2020 12:53 PM

ఫాంటసీ టీం తయారుచేసుకో ...అభిమానికి చురకలు అంటించిన రోహన్ గవాస్కర్


టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తనయుడు మాజీ టీమిండియా ఆటగాడు రోహన్ గవాస్కర్ ఓ అభిమానికి కౌంటర్ ఇచ్చాడు..నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో టీమిండియా ౩౬ పరుగులకే ఆల్ అవుట్ అయి దారుణ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే ..అయితే ఈ ఓటమిపై రోహన్ గవాస్కర్ టీమిండియా మీద విమర్శలు చేసాడు..

తొలి ఇన్నింగ్స్‌ టెస్టు మ్యాచ్‌గా, రెండో ఇన్నింగ్స్‌ టీ20 గా అనిపించిందని ట్విటర్‌లో కామెంట్‌ చేశాడు. పింక్‌ బాల్‌ టెస్టుతో మరో కొత్త ఫార్మాట్‌ పుట్టుకొచ్చిందని పేర్కొన్నాడు. అయితే, రోహన్‌ కామెంట్లపై ఓ అభిమాని విరుచుకుపడ్డాడు. హే బడ్డీ.. ఇంతకూ క్రికెట్‌కు సంబంధించి ఏం సాధించావ్‌. టీమిండియా ఆటగాళ్లపై ఊరికే ఎందుకు కామెంట్‌ చేస్తావ్‌. ముందు నీ జీవితంలో ఏదైనా సాధించు. నీకింకా చిన్నా పిల్లాడి మనస్తత్వమే ఉంది’అని ఎద్దేవా చేశాడు.

ఇక అభిమాని కౌంటర్‌పై రోహన్‌ తనదైన శైలిలో స్పందించాడు.నన్ను బడ్డీ అని కామెంట్‌ చేస్తున్న నీదే పిల్లల మనస్తత్వం. భారత్‌ తరపున వన్డేలకు ప్రాతినిథ్యం వహించాను. కనుకనే టీమిండియాపై కామెంట్లు చేస్తున్నాను. నువ్‌ ఫాంటసీ క్రికెట్‌ ఆడుకో. ఒకరిపై ఆధారపడకుండా బతకడం నేర్చుకో’ అని చురకలు వేశాడు...

Tags :

Advertisement