Advertisement

పుణెలో బయటపడ్డ దొంగనోట్ల రాకెట్

By: chandrasekar Thu, 11 June 2020 8:41 PM

పుణెలో బయటపడ్డ దొంగనోట్ల రాకెట్


పుణెలో దొంగనోట్ల రాకెట్ గుట్టు రట్టు చేసి రూ.10 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. అందులో భారత కరెన్సీతో పాటు అమెరికా డాలర్లు కూడా ఉన్నాయి. దేశంలో భారీ ఎత్తున నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. సుమారు రూ.10కోట్ల విలువైన దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సదరన్ కమాండ్ ఇంటెలిజెన్స్ వింగ్, పూణె క్రైం బ్రాంచ్ జాయింట్ ఆపరేషన్‌లో ఈ రాకెట్‌ను ఛేదించారు. జూన్ 10వ తేదీన ఈ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఐదుగురు సాధారణ పౌరులు కాగా, ఓ జవాన్ కూడా ఉన్నట్టు తెలిపారు.

దొంగ నోట్ల రాకెట్‌కు సంబంధించి మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో జాయింట్ సీపీ ఆదేశాలతో క్రైం డీసీపీ బచ్చన్ సింగ్ ఆపరేషన్ చేపట్టారు. మిలటరీ ఇంటెలిజెన్స్ సహకారంతో బుధవారం మధ్యాహ్నం దాడులు చేశారు. ఓ జవాన్, మరికొందరు కలసి దొంగ నోట్లను ముద్రిస్తుండగా పట్టుకున్నారు. అందులో భారతీయ కరెన్సీతో పాటు అమెరికన్ డాలర్లు కూడా ఉన్నాయి. రూ.10 కోట్ల విలువైన దొంగ నోట్లతో పాటు రూ.3 లక్షలు విలువైన ఒరిజినల్ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫేక్ పిస్టల్, మరికొన్ని ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులు మరింత విచారణ జరుపుతున్నారు. అదుపులోకి తీసుకున్న జవాన్‌ను పూణెలోని ఆర్మీ అధికారులకు అప్పగించారు. యూనిట్ 4, యాంటీ నార్కోటిక్స్ సెల్, క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

Tags :
|

Advertisement