Advertisement

  • దుకాణాల్లో కార్మికులు చేసే అన్ని పనులూ చేస్తున్న రోబోలు

దుకాణాల్లో కార్మికులు చేసే అన్ని పనులూ చేస్తున్న రోబోలు

By: chandrasekar Mon, 21 Sept 2020 12:55 PM

దుకాణాల్లో కార్మికులు చేసే అన్ని పనులూ చేస్తున్న రోబోలు


కరోనా విజృంభణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా హాస్పిటల్స్ లో రోబో సేవలను వినియోగంలోకి తీసుకొచ్చారు. వీటిని హౌస్‌కీపింగ్‌, భోజనం సప్లై, మందులను అందించడంలాంటి పనులకు వాడుతున్నారు. పలు దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు, భౌతిక దూరాన్ని పాటించాలని హెచ్చరించేందుకు ఉపయోగిస్తున్నారు.

అయితే, జపాన్‌ దేశంలో వర్కర్ల కొరత తీవ్రంగా ఉంది. ఎందుకంటే అక్కడ వృద్ధుల జనాభా ఎక్కువ. దీంతో అక్కడి సూపర్‌మార్కెట్లు పనిచేసే వారి కొరతను అధిగమించేందుకు రోబోలను వాడుతున్నాయి.

సీఎన్ఎన్ నివేదిక ప్రకారం, జపాన్ వృద్ధాప్య జనాభా కారణంగా తీవ్రమైన కార్మిక కొరతను ఎదుర్కొంటోంది. జనాభాలో దాదాపు మూడోవంతు 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారే. దీంతో యువకార్మికులే కనిపించడం లేదు. ఈ కొరత తీర్చేందుకు ఫ్యామిలీమార్ట్ రోబోటిక్స్ సంస్థ ముందుకొచ్చింది.

టెలిసిసిస్టెన్స్ తో భాగస్వామ్యం అయి మోడల్-టి రోబోట్‌ను సృష్టించింది. ఈ ఆండ్రాయిడ్‌ రోబోను రిమోట్‌ కంట్రోల్‌తో ఆపరేట్‌ చేయవచ్చు. ఈ రోబోలు కార్మికులు చేసే అన్ని పనులూ చేస్తున్నాయి. వస్తువులను ఎత్తడం, వాటిని ర్యాక్‌లలో సర్దడం, అవసరమున్న వస్తువును తీసుకురావడం లాంటి పనులు చేస్తున్నాయి.

Tags :
|
|

Advertisement