Advertisement

  • కరోనా నిబంధనలు అతిక్రమించిన ఊతప్ప ..హెచ్చరించిన అంపైర్లు

కరోనా నిబంధనలు అతిక్రమించిన ఊతప్ప ..హెచ్చరించిన అంపైర్లు

By: Sankar Fri, 02 Oct 2020 05:12 AM

కరోనా నిబంధనలు అతిక్రమించిన ఊతప్ప ..హెచ్చరించిన అంపైర్లు


కరోనా కంటే ముందు క్రికెట్ లో బంతి స్వింగ్ అవ్వడం కోసం ప్రతి యొక్క ఫీల్డర్ కూడా ఆ బంతి మీద ఉమ్మి వేసి బాగా రుద్దేవారు దీనితో బంతి బాగా స్వింగ్ అయ్యేది ..అయితే కరోన వచ్చాక అన్ని పరిస్థితులు మారిపోయాయి.బంతి మీద ఉమ్మితో రుద్దడాన్ని ఐసీసీ తాత్కాలికంగా నిషేదించింది...కరోనా నేపథ్యంలో ఐసీసీ జారీ చేసిన కోవిడ్‌–19 ప్రొటోకాల్‌ను భారత క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప అతిక్రమించాడు.

రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న ఉతప్ప బుధవారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బంతికి లాలాజలం (ఉమ్ము) రుద్దాడు. పొరపాటో లేక అలవాటో గానీ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో అతను ఈ పని చేశాడు. ఐదో బంతిని ఆడిన కోల్‌కతా ఓపెనర్‌ నరైన్‌ ఇచ్చిన క్యాచ్‌ను రాబిన్‌ నేలపాలు చేశాడు. తర్వాత బంతికి సలైవా (ఉమ్ము) రుద్దుతూ కెమెరా కంటపడ్డాడు. ఇదేం నిర్వాకమంటూ ఇది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఉమ్మి రుద్దడాన్ని నిషేధించారు. అలా చేస్తే అంపైర్లు బంతిని శానిటైజ్‌ చేసి నిబంధనలు గుర్తు చేస్తారు. అలాగే మళ్లీ మళ్లీ (రెండుసార్లు) చేస్తే హెచ్చరిస్తారు. అయినా మారకపోతే శిక్షగా ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇస్తారు.

Tags :
|
|
|
|

Advertisement